Newsఅమరావతిలో మహేష్ ఇంటర్నేషనల్ స్కూల్.. దాని స్పెషాలిటీస్ ఏంటంటే..!

అమరావతిలో మహేష్ ఇంటర్నేషనల్ స్కూల్.. దాని స్పెషాలిటీస్ ఏంటంటే..!

సూపర్ స్టార్ మహేష్ కూడా బిజినెస్ రంగంలో దిగుతున్నాడు. ఏపి రాజధాని అమరావతిలో అధునాతన సౌకర్యాలతో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే మహేష్ ఎంబి ప్రొడక్షన్స్ లో తను చేసే సినిమాలకు సమర్పకుడిగా ఉంటున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా బిజినెస్ లోకి దిగుతున్నాడు.

మంచి చదువుని అందిస్తూ దాని ద్వారా ఖ్యాతి సంపాదించాలని చూస్తున్నాడు మహేష్. మహేష్ బావ గల్ల జయదేవ్ గుంటూర్ ఎంపి గా ఉన్నారు. ఆయన సహకారంతోనే అమరావతిలో ఈ స్కూల్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే శ్రీమంతుడు సినిమా తీయడమే కాదు ఆ సినిమా స్పూర్తితో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్స్థలమైన బుర్రిపాలెంను దత్తత తీసుకుని డెవలప్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అందరికి ఇంటర్నేషనల్ స్టడీస్ అందుబాటులోకి రావాలని మహేష్ ముందడుగు వేస్తున్నాడు. అసలైతే ఈ స్కూల్ ముందు హైదరాబాద్ లోనే నిర్మిచదలచినా అక్కడ ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కువయ్యాయని ఆలోచించి కొత్త రాజధాని అమరావతిలో ఈ స్కూల్ ప్లాన్ చేస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news