Newsషాకింగ్ : భరత్ అంత్యక్రియలకు హాజరు కాని హీరో రవితేజ...

షాకింగ్ : భరత్ అంత్యక్రియలకు హాజరు కాని హీరో రవితేజ మరియు తల్లి

టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్‌ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం రాయదుర్గం (జూబ్లీహిల్స్‌ రోడ్డు) మహాప్రస్థానంలో జరిగాయి. చివరి చూపు చూసేందుకు సినీరంగానికి చెందిన నటులు, దర్శకులు తరలివచ్చారు. భరత్‌ మృతదేహాన్ని విద్యుత్‌ దహన పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించారు. రవితేజ బాబాయి మూర్తిరాజు అంతిమ కార్యక్రమాలు పూర్తి చేశారు.

ఈ రోజు ఉదయం శంషాబాద్ మండలం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భరత్ అంత్యక్రియలకు హీరో రవి తేజ హాజరు కాలేదు.తన తమ్ముడి భౌతిక కాయాన్ని చివరి చూపు చూడలేనని రవి తేజ చెప్పారు.భరత్ భౌతిక కాయాన్ని చూడటానికి తన తల్లి కూడా ఇష్టపడలేదు. రవితేజ మరో తమ్ముడు రఘు, బాబాయి మూర్తి రాజు తప్ప మిగతా తమ కుటుంబ సభ్యులు ఎవరు లేకుండానే అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో భరత్‌ తమ్ముడు రఘు, సినీ నటి జీవితా రాజశేఖర్‌, రఘుబాబు, అలీ, ఉత్తేజ్‌, విక్రమ్‌, తదితరులు పాల్గొన్నారు. కేవలం కొంతమంది మిత్రులు,పరిచయస్తులు మాత్రమే హైదరాబాద్ మహాప్రస్థానానికి వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యారు.

https://youtu.be/TgrfKVcwLLo

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news