Movies638 వ రోజు న బాహుబలి (రి రిలీజ్ మొదటి రోజు)...

638 వ రోజు న బాహుబలి (రి రిలీజ్ మొదటి రోజు) కలెక్షన్లు వివరాలు

బాహుబలి సినిమా సృష్టించిన సంచనాలు ఎప్పటికీ మరవలేము. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లటమే కాకుండా తెలుగు సినిమా మార్కెట్ స్థాయి ని వందల కోట్ల రూపాయలకు పెంచింది. తెలుగు సినిమా అంటే కొంత చిన్న చూపు ఉన్న ఉత్తర భారతీయులకి బాహుబలి ని ఇండియన్ సినిమా అనే స్థాయి కి తీసుకువెళ్ళింది. బాహుబలి మొదటిభాగం విడుదలై నిన్నటికి 638 రోజులైనప్పటికీ ఆ సినిమా గురించి మరీ ముఖ్యంగా కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనే చర్చలు ప్రధాని స్థాయిలో జరుగుతున్నాయి అంటే తెలుగు సినిమాకి ఎంతో గర్వకారణం.

ఏప్రిల్ 7 వ తారీఖున బాహుబలి మొదటి భాగాన్ని హిందీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సార్లు టీవీ లలో వచ్చినప్పటికీ థియేటర్లలో ఆ విజువల్ వండర్ ని చూడటానికి ప్రేక్షకులు బాగానే థియేటర్ల వైపు పరుగులు పెట్టారు. ట్రేడ్ లెక్కల ప్రకారం 1.2-1.5 కోట్ల రూపాయల కలెక్షన్ల గ్రాస్ ని బాహుబలి సినిమా సాధించింది. ఎన్నో ఫార్మాట్లలో బాహుబలి సినిమా దొరుకుతున్నప్పటికీ థియేటర్ల కి వచ్చి మరీ బాహుబలి సినిమాని చూస్తున్నారంటే సాధారణ విషయం కాదు. ఈ రెండు వారాలలో 10 నుండి 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రావచ్చని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news