Newsరామ్ చరణ్ భార్య పై రూమర్లు .. మెగా ఫ్యామిలీ గుర్రు!!

రామ్ చరణ్ భార్య పై రూమర్లు .. మెగా ఫ్యామిలీ గుర్రు!!

సోషల్ మీడియా దెబ్బకి సెలెబ్రిటీ ల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. రోడ్డున పడ్డం అంటే ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వారి వారి పర్సనల్ విషయాల గురించి రాసేస్తూ వస్తున్నారు. ఎవరికి ఏది తడితే దాన్ని సోషల్ మీడియా లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కి ఇదే తలనొప్పి మొదలైంది. గడిచిన రెండు..మూడు రోజులుగా సోషల్ మీడియాలోనూ.. ఫిలింనగర్ వర్గాల్లోనూ ఆసక్తికరమైన అంశంపై పెద్ద చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ హాట్ న్యూస్ ఏమిటంటే.. మెగాస్టార్ ఫ్యామిలీలో హ్యాపీ మూమెంట్ ఒకటి షురూ అయ్యిందని.. రాంచరణ్ తండ్రి కాబోతున్నట్లుగా ఒక వార్త పుట్టుకొచ్చింది.

ఇందులో ఒక్క శాతం కూడా నిజం లేదని స్పష్టం చేస్తోంది మెగా క్యాంప్. ఈ వార్తను ఎవరు పుట్టించారో కానీ..ఇదో పెద్ద వార్తగా మారటంతో.. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారట చెర్రీ అండ్ కో. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఈ గాలి వార్తను.. అదేదో గొప్ప వార్తగా.. తండ్రి కానున్న చెర్రీ అంటూ రకరకాల పేర్లతో ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఈ వార్తను పెట్టేయటంపై మెగా ఫ్యామిలీ తెగ ఫీలవుతోంది. ఎవరు చెప్పారని.. ఇలాంటి వ్యక్తిగతమైన వార్తల్ని సైతం క్రాస్ చెక్ చేయకుండా పబ్లిష్ చేసేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.నిజమే.. వారి ఆవేదనను అర్థం చేసుకోదగినదే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news