Moviesకాటమరాయుడు టికెట్టు ముక్క లేదు.. కొన్ని నిమిషాల్లోనే అన్నీ బుక్!!

కాటమరాయుడు టికెట్టు ముక్క లేదు.. కొన్ని నిమిషాల్లోనే అన్నీ బుక్!!

గత రెండు నెలలుగా ఒక్క పెద్ద సినిమా కూడా లేకపోవడం తో కాటమరాయుడు పట్ల జనాలు బోలెడు ఆసక్తి చూపిస్తున్నారు .. ఈ నెల లో ఒక మోస్తరు కూడా సినిమా లేక జనం విసుగు చెంది ఉన్నారు. సో ఈ కొత్త పవన్ చిత్రానికి జన క్రేజీ గా టికెట్ లు బుక్ చేసుకుంటున్నారు. బుక్ మై షో లో ఇప్పటికే టికెట్ల రద్దీ పెరిగిపోయి టికెట్లు అయిపోగా థియేటర్ ల దగ్గర కూడా బుకింగ్ లు ఓపెన్ చెయ్యడమే ఆలస్యం అన్నట్టుగా ఎగబడుతున్నారు జనాలు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 90 శాతం థియేటర్లలో ‘కాటమరాయుడు’ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అంచనా. హైదరాబాద్ లాంటి నగరాల్లో 95 శాతం థియేటర్లకు బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

‘కాటమరాయుడు’ కోసం ఇబ్బడిముబ్బడిగా స్క్రీన్లు ఇచ్చినా సరే.. బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో లేవు. దాదాపుగా అన్ని థియేటర్లలో అన్ని షోలకూ టికెట్లు అయిపోయాయి. ఎక్కడో నగర శివార్లలో కొన్ని చోట్ల మినహాయిస్తే టికెట్లు అందుబాటులో లేవు. వీకెండ్ మొత్తానికి బుకింగ్స్ పూర్తయిపోయాయి. ఇంకా ఐమాక్స్ లాంటి కొన్ని థియేటర్ల బుకింగ్స్ ఓపెన్ కాలేదు. వాటి కోసం కూడా జనాలు ఆవురావురుమని ఉన్నారు. బుకింగ్స్ ఓపెనవడం ఆలస్యం కొన్ని నిమిషాలన్నీ ఆ టికెట్లూ అయిపోవడం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news