Newsఅఖిల్ భామకి బన్నీ రామ్ చరణ్ లంటే తెగ ఇష్టమట!!

అఖిల్ భామకి బన్నీ రామ్ చరణ్ లంటే తెగ ఇష్టమట!!

ఈ మధ్య సోషల్ మీడియా అభివృద్ధి చెందాకా హీరోలు , హీరోయిన్లు మరియు అభిమానులకి మధ్య దూరం బాగా తగ్గింది. ప్రేత్యేకంగా చెప్పుకోవాలంటే ట్విట్టర్ వచ్చాక తమ అభిమాన తారల విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్నారు. ఇక లైవ్ చాట్ అనే కార్యక్రమం ద్వారా సినీ తారలు కూడా డైరెక్ట్ గా అభిమానుల ప్రశ్నలకి సమాదానాలు ఇస్తున్నారు.అలా జరిగిన ఒక లైవ్ చాట్ లో అఖిల్ హీరోయిన్ సాయేషా సైగల్ మీకు ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరు ? అని ప్రశ్నించగా అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ లు అంటే చాలా ఇష్టమని సమాధానం చెప్పింది.

ఇక తన అభిమానులతో సాయేషా లైవ్ చాట్ లోని ముఖ్యాంశాలు:

* సాయేషాకి ఇష్టమైన ప్రదేశం: లండన్‌, ఇటలీ

* తొలి సెలబ్రిటీ క్రష్‌ : హృతిక్‌ రోషన్‌.. అప్పుడు సాయేషా వయసు నాలుగేళ్లు

* బాలీవుడ్‌లో కలిసి పనిచేయాలనుకుంటున్న దర్శకుడు మరియు హీరో : దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ, నటుడు రణ్‌వీర్‌ సింగ్‌

* ఇండియాలో ఇష్టమైన ప్రదేశం: హైదరాబాద్‌

* ఇష్టమైన కలర్ : ఎరుపు

* ‘అఖిల్‌’ సినిమాలో ఇష్టమైన పాట: ‘పడేసావే..పడేసావే..నీ మాయలో నన్ను పడేశావే’

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news