Moviesపవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా .. నాలుగు ట్రైలర్ లు!!

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా .. నాలుగు ట్రైలర్ లు!!

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాదు… సినిమా ఇండస్ట్రీలోనూ క్రేజే. అందుకే పవన్ `కాటమరాయుడు`కి నాలుగు కొత్త సినిమాల ట్రైలర్లు అటాచ్ అయ్యాయి. పవన్ సినిమాల్ని చూడ్డానికి ప్రేక్షకులు పెద్దయెత్తున ఎగబడతారు కాబట్టి ఆ సినిమాలతో పాటుగా కొత్త సినిమాల ట్రైలర్లని రిలీజ్ చేస్తే మంచి ప్రచారం లభిస్తుంది. అందుకే పవన్ సినిమాల గురించి కాచుకొని ఎదురు చూస్తుంటారు దర్శకనిర్మాతలు.

శుక్రవారం విడుదలవుతున్న కాటమరాయుడుకైతే ఆ విషయంలో మరింత డిమాండ్ ఏర్పడింది. అందుకే ఆ సినిమాకి నాలుగు ట్రైలర్లు ఎటాచ్ అయ్యాయి. వరుణ్ తేజ్ మిస్టర్ తో పాటు – వెంకటేష్ గురు – కార్తి చెలియా – నిఖిల్ నటించిన కేశవ సినిమాలకి సంబంధించిన ట్రైలర్లని కాటమరాయుడు ప్రింట్లకి ఎటాచ్ చేశారు. ఒకొక్క చోట ఒక్కో ట్రైలర్ ప్రదర్శితమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్దయెత్తున విడుదలవుతోంది కాటమరాయుడు. ఆ క్రేజ్ ని తెలుసుకొనే దర్శకనిర్మాతలు కాటమరాయుడుపై కర్చీఫ్ వేసేశారు. పవన్ మాత్రం ఎవరి ట్రైలర్ నీ కాదనకుండా అందరి సినిమాల ట్రైలర్లూ తన సినిమాతో పాటు ప్రదర్శితమయ్యేలా నిర్మాతకి సూచనలు అందజేశాడు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news