మహేష్ పాలిట విలన్ గా మారనున్న గోపి చంద్ ..!

mahesh and gopi chand

అప్పుడెప్పుడో తేజ డైరెక్షన్ లో మహేష్ హీరో గా నటించిన నిజం సినిమా మీకు గుర్తే ఉంది కదా ? ఆ సినిమా కమర్షియల్‌గా హిట్ కాకపోయిన మహేష్ కెరియర్‌లో ఉత్తమ నటుడిగా మాత్రం నంది అవార్డ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో దేవుడు క్యారెక్టర్‌లో మహేష్‌నే భయపట్టేశాడు విలన్‌గా నటించిన గోపీచంద్. ఆ తరువాత హీరోగా ప్రమోషన్ పొందిన గోపీచంద్ వరుస సినిమాలను చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ మధ్య కాలంలో సరైన హిట్టే లేక ప్లాప్ లతో నెట్టుకొస్తున్నాడు. తాజాగా గోపి చంద్ మళ్ళీ పాత పంథాలోనే విలన్ పాత్రలు చేసేందుకు అభ్యంతరమే లేదని ప్రకటించేశాడు.

యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్ కొన్నేళ్లుగా ఏమంత బాగా లేదు. గత ఆరేడేళ్లలో గోపీచంద్‌కు దక్కిన ఏకైక హిట్టు ‘లౌక్యం’ మాత్రమే. దానికంటే ముందు, ఆ తర్వాత వచ్చిన అతడి సినిమాలన్నీ నిరాశే మిగిల్చాయి. అతను నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’, ‘ఆక్సిజన్’ సినిమాలు అసలు విడుదలకే నోచుకోకుండా పోయాయి. ఇలాంటి సమయంలో చక్రి అనే కొత్త దర్శకుడితో తన 25వ సినిమాను మొదలుపెట్టాడు గోపీ చంద్.

‘జయం’, ‘వర్షం’ లాంటి సినిమాల్లో విలన్ పాత్రలు చేసి గుర్తింపు సంపాదించడం, ఆపై మళ్లీ హీరోగా మారి విజయవంతం కావడం తెలిసిందే. ఇప్పుడతను బోయపాటి శ్రీను దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించే సినిమాలో విలన్ పాత్ర చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

మహేష్ బాబుతో వచ్చే ఏడాది చివర్లో ఒక సినిమా మొదలుపెట్టడానికి బోయపాటి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 14 రీల్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం గోపీచంద్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడట బోయపాటి. ‘లెజెండ్’ సినిమాతో జగపతిబాబును విలన్‌గా చూపించి అతడి కెరీర్‌ను మలుపు తిప్పాడు బోయపాటి. ఇప్పుడు గోపీచంద్ కెరియర్ ని కూడా అలాగే మలుపు తిప్పబోతున్నాడా ..? అయితే గోపి మళ్ళీ హీరోగా నటిస్తాడా లేక విలన్ గానే సెటిల్ అయిపోతాడా అనేది తెలియాల్సి ఉంది.

More from my site