ఆడియో రైట్స్ తో పవర్ స్టార్ రికార్డ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ సినిమా అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఇక ఆ సినిమాకు త్రివిక్రం లాంటి డైరక్టర్ తోడైతే ఇక ఆ లెక్క వేరేలా ఉంటుంది. ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమా అదే అంచనాలతో వస్తుంది. ఈ సినిమా విషయంలో ప్రతిది స్పెషల్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో డిసెంబర్ 14న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో సంస్థ 2 కోట్లిచ్చి కొనేసిందట. ఈ రేంజ్ ఆడియో రైట్స్ అమ్ముడవడం సరికొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ సినిమా నుండి రిలీజ్ అయిన బయటకొచ్చి చూస్తే సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను మెప్పించేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో రాబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సినిమాలో పవన్ బిటెక్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడట. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్ త్రివిక్రం కాంబోలో వస్తున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

 

Leave a comment