సంచలనాలు సృష్టిస్తున్న అరవింద సమేత రెండో సాంగ్..!

Peniviti lyrical Video song

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా నుండి రెండో సాంగ్ రిలీజ్ అయ్యింది. పెనివిటి అంటూ వచ్చిన ఈ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రచించగా తమన్ మ్యూజిక్ అందించాడు. ముందునుండి ఈ సాంగ్ మీద అంచనాలు పెంచగా ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సాంగ్ ఉందని చెప్పొచ్చు.

రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ తో మరోసారి తన పెన్ పవర్ ఏంటో చూపించారు. సినిమాలో ఒక సాంగ్ స్కిప్ చేస్తున్నారని తెలిసి బాధపడిన ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఈ సాంగ్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.

మొదటి సాంగ్ అనగనగనగా అరవిందట కన్నా సెకండ్ సాంగ్ గా వచ్చిన పెనివిటి సాంగ్ బాగుంది. మ్యూజిక్ విషయంలో త్రివిక్రం చాలా కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. పూజాతో పాటుగా ఈ సినిమాలో ఈషా రెబ్బ కూడా నటిస్తుంది.

Leave a comment