“అమర్ అక్బర్ ఆంటోనీ ” సెన్సార్ షాక్..!

64

మాస్ మహరాజ్ రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. రవితేజ 3 డిఫరెంట్ రోల్స్ పోశిస్తున్న ఈ సినిమాలో కామెడీ, థ్రిల్ అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా ప్లాన్ చేశాడట శ్రీను వైట్ల.
2
సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారట. సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా సెన్సార్ సభ్యుల నుండి కూడా మంచి మెప్పు పొందిందని తెలుస్తుంది. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో పాటుగా ఇలియానా గ్లామర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందట. ముఖ్యంగా సినిమా శ్రీను వైట్ల వాటా (ఓల్ ఆంధ్రా తెలంగాణా అసోషియేషన్) అంటూ సునీల్, వెన్నెల కిశోర్, సత్య, రఘుబాబులతో పండించిన కామెడీ అదిరిపోతుందట.
1
వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్, దూకుడులో బ్రహ్మి, ఎమ్మెస్ పండించిన కామెడీలా ఇది ఉంటుందని అంటున్నారు. రవితేజతో నీకోసం, వెంకీ, దుబాయ్ శ్రీను సినిమాలను చేసిన శ్రీను వైట్ల అమర్ అక్బర్ ఆంటోనీతో కూడా ఆ సినిమాల హిట్ ఫలితాన్ని రిపీట్ చేయాలని చూస్తున్నాడు.

Leave a comment