Moviesతన సినిమాలు ఫ్లాప్ అవ్వకూడదు అని అలాంటి నిర్ణయం తీసుకున్న విజయ్...

తన సినిమాలు ఫ్లాప్ అవ్వకూడదు అని అలాంటి నిర్ణయం తీసుకున్న విజయ్ దేవరకొండ.. ఇక రౌడీ హీరోకి అన్ని మంచి రోజులే..!

విజయ్ దేవరకొండ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైన పేరు . మరీ ముఖ్యంగా రౌడీ హీరో అంటూ ట్యాగ్ చేయించుకున్న విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమాలను చూస్ చేసుకుంటూ ఉంటాడు మనకు తెలిసిందే. బడ్జెట్ తక్కువైనా సరే కంటెంట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాడు . అభిమానులు కూడా అందుకే విజయ్ దేవరకొండ ను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా నేటి కాలం యువత ఎలాంటి సినిమాలను ఇష్టపడుతుందో అదే విధంగా ఆయన సినిమాలను చూస్ చేసుకుంటాడు .

కానీ అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చే ప్రతి సినిమాను కూడా అదే రేంజ్ లో ఉండేలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. కానీ కొన్ని కొన్ని సార్లు విజయ్ దేవరకొండ తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఆయన ఫ్యాన్స్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. కెరియర్ మంచి స్పీడ్ మీద వెళ్తున్నప్పుడే ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీలకు ఓకే చేయడం అలాంటి రోల్స్ లో విజయ్ దేవరకొండ ను ఫాన్స్ చూడలేకపోవడం తో ఆ సినిమాలో ఫ్లాప్ అవుతున్నాయి .

రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ గా మారింది . అంతకుముందు లైగర్ కూడా అలాగే డిజాస్టర్ టాక్ దక్కించుకుంది . దీంతో ఇక సినిమాలు ఫ్లాప్ కాకూడదు అని విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నాడట . తన సినిమాల విషయంలో ఫాన్స్ నచ్చే విధంగా కంటెంట్ ఉంటేనే ఆ సినిమాని ఓకే చేస్తాడట. లేకపోతే కోట్లు ఇచ్చినా సరే ఆ సినిమాను రిజెక్ట్ చేసేస్తాడట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఇక విజయ్ దేవరకొండకు అన్ని మంచి రోజులే అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news