Moviesవిజయ్ దేవరకొండ నెంబర్ ని రష్మిక తన ఫోన్ లో ఏమని...

విజయ్ దేవరకొండ నెంబర్ ని రష్మిక తన ఫోన్ లో ఏమని సేవ్ చేసుకుందో తెలుసా? ఇదేం పేరు రా బాబోయ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్న లవ్ స్టోరీ అనే చెప్పాలి. వీళ్ళు ప్రేమించుకుంటున్నారా ..? లేదా..? అన్న విషయం పక్కన పెడితే వీళ్ళకి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి .

రష్మిక మందన్నా.. పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ముందుకు దూసుకెళ్తుంది. విజయ్ దేవరకొండ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాడు . వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది . రీసెంట్ గా బాలీవుడ్ నేహా దుపియా పోడ్ కాస్ట్ లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది రష్మిక మందన్నా. ఆ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తో తమ రిలేషన్షిప్ పై ఓపెన్ గా స్పందించింది. అంతేకాదు విజయ్ దేవరకొండను ముద్దుగా ఏమని పిలుస్తుందో..? తన ఫోన్లో ఏమని సేవ్ చేసుకుందో అనే విషయాన్ని కూడా బయటపెట్టింది .

రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ ఫోన్ నెంబర్ ని విజ్జు అంటూ తన మొబైల్లో సేవ్ చేయించుకుందట . అంతేకాదు ఆమె విజయ్ ను విజ్జు విజ్జు అంటూ ముద్దుగా పిలుస్తుందట . నిజానికి విజ్జు అంటే అందరూ గర్ల్ అనుకుంటారు . మరి రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండకు ఎందుకు అలాంటి పేరు పెట్టింది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు . ఏదో తెలుసుకున్న కొంతమంది రొమాంటిక్ క్యూట్ పేయిర్ అంటుంటే మరి కొంతమంది ఇదేం పేరు రా బాబు అంటూ అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ప్రెసెంట్ ఈమెకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news