Moviesగీతామాధురి కొడుకు పేరు ఏంటో తెలుసా..? నందమూరి ఫ్యాన్స్ కి తెగ...

గీతామాధురి కొడుకు పేరు ఏంటో తెలుసా..? నందమూరి ఫ్యాన్స్ కి తెగ నచ్చేసే నేమ్..!!

గీతా మాధురి .. పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి ఓ బడా టాప్ సెలబ్రిటీకి ఉండాల్సిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకునింది . అందానికి అందం .. పాటకి పాట..టాప్ సింగర్ అయినా సరే చాలా జోవియల్గా అందరితో కలిసిపోతుంది . మరీ ముఖ్యంగా గీతామాధురి బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత ఆమెపై జనాలు మరింత రేంజ్ లో ఆశలు పెంచేసుకున్నారు.

ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అక్కడి నుంచే పెరిగింది . టాలీవుడ్ యంగ్ హీరో నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న గీతామాధురి రీసెంట్గా రెండోసారి తల్లి అయింది. పండు లాంటి బాబుకు జన్మనిచ్చింది . ఫిబ్రవరి 10వ తేదీ గీతామాధురి నందు రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు . ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు . కాగా రీసెంట్గా గీతామాధురి నందు తన కొడుకుకి పేరు పెట్టారు. ఆ పేరు నందమూరి అభిమానులకు బాగా నచ్చేసింది.

ఎంతలా అంటే ఇప్పుడు గీతామాధురి కొడుకు పేరుని తెగ ట్రెండ్ చేసేస్తున్నారు జనాలు . ఇంతకీ గీతామాధురి తన కొడుకుకి ఏమని పేరు పెట్టిందో తెలుసా ..? చాలా ట్రెడిషనల్ గా చాలా పద్ధతిగా గీతామాధురి తన కొడుకుకి “ధృవ ధీర్ తారక్” అంటూ తన ఫేవరెట్ హీరో పేరును పెట్టుకొచ్చింది. గీతామాధురి బాలయ్యకు – ఎన్టీఆర్ కి బిగ్ ఫ్యాన్ . ఈ విషయం చాలా సార్లు చెప్పింది . దీంతో నందమూరి ఫ్యాన్స్ ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news