Moviesపూరి జగన్నాధ్ పెట్టిన చిచ్చు..సూర్య-మహేశ్ బాబుల మధ్య అంత పెద్ద గొడవ...

పూరి జగన్నాధ్ పెట్టిన చిచ్చు..సూర్య-మహేశ్ బాబుల మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో చేయాల్సిన కథ మరొక స్టార్ హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం. ఇది మనం చాలా సందర్భాలలో చూసాం . అయితే ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కథను ఆ స్టార్ హీరో ఓకే చెప్పి ఆ తర్వాత డైరెక్టర్ మరొక హీరోతో తెరకెక్కించడం రేర్ గా జరుగుతూ ఉంటుంది . అలాంటి ఓ విషయంలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురయ్యాడు మహేష్ బాబు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా బిజినెస్ మాన్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి హిట్ అయిందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా అప్పటివరకు సైలెంట్ అనుకున్నా మహేష్ బాబు చేత బూతు డైలాగులు కూడా చెప్పించాడు పూరి జగన్నాథ్. నిజానికి ఈ సినిమాలో హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అని అనుకున్నారట పూరి జగన్నాథ్.

ఇదే కథను ఆయనకు వివరించారట . ఆయన కూడా ఓకే చేశారట. త్వరలోనే అగ్రిమెంట్ పై సైన్ కూడా చేస్తామంటూ అన్ని మాట్లాడుకున్నారట. అయితే పూరి జగన్నాథ్ ఫ్రెండ్ సలహాతో కోలీవుడ్ హీరోతో కన్నా టాలీవుడ్ హీరోతో ఈ సినిమా చేస్తే ఇంకా బాగుంటుంది అని మహేష్ బాబు పేరుని సజెస్ట్ చేశారట . మహేష్ బాబు ఈ కథ వినగానే వెంటనే అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసేసాడు . ఈ విషయం తెలుసుకున్న సూర్య సైలెంట్ గా అయిపోయాడు . ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . పూరి జగన్నాథ్ చేసిన తప్పు పై అప్పట్లో సూర్య ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు.. కొందరు పరోక్షంగా మహేష్ బాబు ను ట్రోల్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news