Moviesకల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు భైరవ అని పెట్టింది ఎవరో తెలుసా.....

కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు భైరవ అని పెట్టింది ఎవరో తెలుసా.. ఇక్కడ కూడా ఆయన పెత్తనమేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా కల్కి. రీసెంట్ గానే సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ హీరో త్వరలోనే సలార్ 2 ను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ప్రజెంట్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. రీసెంట్ గానే ఇటలీలో దిశా పటానితో ఓ రొమాంటిక్ సాంగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు .

కల్కి సినిమాకి సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరుని రివిల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఆయన భైరవ అనే పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ పేరు వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మగధీర సినిమాలోని రామ్ చరణ్ పాత్ర .. కాగా ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ పేరు భైరవగా పెట్టడానికి నాగ్ అశ్విన్ రాజమౌళి హెల్ప్ తీసుకున్నాడు అన్న ప్రచారం ఊపొందుకుంది.

కల్కి సినిమాలో డిఫరెంట్ గా ప్రభాస్ కి ఏ పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్న మూమెంట్లో ప్రభాస్ నాగ్ అశ్విన్ రాజమౌళి సలహా తీసుకున్నారట. అప్పుడు ఇదే పేరుని ఫిక్స్ చేశారట. అంతేకాదు ఈ సినిమా కోసం నీ పెత్తనం ఏంటి ..?అంటూ పలువురు మండిపడుతున్నారు . రాజమౌళి చేసిన హెల్ప్ ను మర్చిపోయి దూషిస్తున్నారు. మొదటి నుండి ప్రభాస్ కి రాజమౌళితో ఉన్న చనువు మనకు తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news