Moviesరామ్ చరణ్ పై ఇంత చెత్త రుమరా ..? పోతారు రా...

రామ్ చరణ్ పై ఇంత చెత్త రుమరా ..? పోతారు రా రేయ్ నాశనం అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. అవతల ఉన్నది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా సరే సెకండ్ కూడా ఆలోచించకుండా .. నీచమైన మాటలతో దారుణాతి దారుణమైన పదాజాలంతో దూషిస్తున్నారు కొందరు ఆకతాయిలు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ పై నీచాతి నీచమైన రూమర్ వైరల్ గా మారింది.

రీసెంట్గా రాంచరణ్ – ఉపాసన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీ నుంచి రాంచరణ్ అటెండ్ అయ్యి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే రామ్ చరణ్ ఈ ఈవెంట్లో అటెండ్ అయినందుకు గాను 50 కోట్లు పుచ్చుకున్నాడు అన్న ప్రచారం ఊపొందుకుంది. దీంతో జనాలు ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు .

సిగ్గు లేదారా..? రామ్ చరణ్ బ్యాగ్రౌండ్ ఏంటి ..? వేలకోట్ల ఆస్తి .. ఆయనకు ఇలాంటి చీప్ పనులు చేయాల్సిన అవసరమా ..? ప్రేమతో పిలిస్తే గౌరవంగా వెళ్ళాడు .. సిగ్గులేని వెధవల్లారా అంటూ మెగా ఫ్యాన్స్ అలాంటి ట్రోలింగ్ చేసే వాళ్లపై ఫైర్ అయిపోతున్నారు. అయితే రామ్ చరణ్ డైరెక్ట్ గా డబ్బు తీసుకోలేదు అని రామ్ చరణ్ కి పెట్టిన ఖర్చు.. రిటర్న్ గిఫ్ట్స్ ..హోటల్ ఖర్చు ..ఫ్లైట్ చార్జెస్ ..అతిధి మర్యాదలు మొత్తంగా చూసుకుంటే 50 కోట్లు దాటేసి ఉంటుందని ప్రచారం చేస్తున్నారు కొందరు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news