Moviesడార్లింగ్ ప్రభాస్ పిలిచి ఆఫర్ ఇస్తే .. రిజెక్ట్ చేసిన శ్రీముఖి...

డార్లింగ్ ప్రభాస్ పిలిచి ఆఫర్ ఇస్తే .. రిజెక్ట్ చేసిన శ్రీముఖి ..ఎందుకో తెలుసా..?

శ్రీముఖి .. ఇండస్ట్రీలో ఓ టాలెంటెడ్ యాంకర్ ..సౌండ్ స్పీకర్ ..లౌడ్ స్పీకర్ .. రాములమ్మ ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది . ఒక హెల్ది వాతావరణం నెలకొంటుంది . చాలా జోష్ ఫుల్ గా యాంకరింగ్ చేస్తుంటుంది . యాంకర్ గానే కాకుండా పలు సినిమాలలో కీలకపాత్రలో కనిపించింది . అంతేకాదు హీరోలకి సిస్టర్ పాత్రలో కూడా మెప్పించింది .

గతంలో హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించడానికి అవకాశాలు వచ్చాయి . కొన్ని బోల్డ్ సినిమాలు కూడా చేసింది . అయితే శ్రీముఖికి వెండి తెర కన్నా బుల్లితెర బాగా సెట్ అయింది. అందుకే బుల్లితెరపై సెటిల్ అయిపోయింది . గతంలో హీరో ప్రభాస్ సినిమాలో లునటించే అవకాశం వచ్చిన అమ్మడు రిజెక్ట్ చేసిందట . ప్రజెంట్ ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది.
ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఆయనకు చెల్లిలి పాత్రలో కనిపించడానికి ఆమెకు ఆఫర్ వచ్చిందట . కానీ డార్లింగ్ ప్రభాస్ ను తన డ్రీమ్ బాయ్ గా ఊహించుకుని శ్రీముఖి సిస్టర్ రోల్ చేయనంటే చేయను అంటూ తెగ్గేసి చెప్పేస్తుందట . ఆమె రీజన్ విని ప్రభాస్ కూడా బాగా నవ్వుకున్నాడట . అంతేకాదు ఆ తర్వాత పింకీ.. ఆ పాత్ర కోసం సెలెక్ట్ అయింది . అలా ప్రభాస్ సినిమాలో నటించే మంచి ఛాన్స్ ని మిస్ చేసుకునింది శ్రీముఖి . ఇది తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నవ్వుకుంటున్నారు.

ప్రజెంట్ శ్రీముఖి పలు ఆఫర్లతో బుల్లితెరపై బిజీబిజీగా ముందుకెళ్తుంది . త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . కానీ ఎప్పుడు చేసుకుంటుంది అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news