Moviesకొరటాల శివ - అల్లు అర్జున్ కాంబినేషన్లో మిస్సయిన సూపర్ డూపర్...

కొరటాల శివ – అల్లు అర్జున్ కాంబినేషన్లో మిస్సయిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..చెడ దొబ్బింది ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోస్ ని సెట్ చేయడం చాలా చాలా కష్టం.. మరీ ముఖ్యంగా బడాహీరోలతో కొత్త డైరెక్టర్లు సినిమా అంటే మరింత కష్టం. దానికి ఎన్ని తిప్పలు పడాలో మనందరికీ తెలిసిందే . అయితే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే సూపర్ డూపర్ హిట్ అందుకోవడం చాలా చాలా రేర్ . అలాంటి ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు కొరటాల శివ .

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైం లోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన కొరటాల శివ ..అల్లు అర్జున్ తో ఓ సినిమా తెరకెక్కించాలి అనుకున్నాడు. ఆ మూవీ మరేదో కాదు.. 2013లో రిలీజ్ అయిన “మిర్చి”. ప్రభాస్ కెరియర్నే మలుపు తిప్పిన ఈ సినిమాను మొదటగా అల్లు అర్జున్ కి వివరించారట. అల్లు అర్జున్ కూడా ఇంప్రెస్ అయ్యారట.

కానీ ఆ టైంలో అల్లు అరవింద్ ఈ సినిమాను ఓకే చేయడానికి కొన్ని కండిషన్స్ పెట్టారట . స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అంటూ కండిషన్స్ పెట్టారట. అయితే తాను రాసుకున్న స్క్రిప్ట్ మార్చడం ఇష్టం లేని కొరటాల శివ ఆ స్క్రిప్ట్ను ప్రభాస్ కి వివరించి తనకు నచ్చిన విధంగా తెరకెక్కించేశాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ప్రభాస్ కెరియర్ ని టర్న్ చేసింది. బన్నీ మంచి సినిమాను మిస్ చేసుకున్నట్టయింది . అల్లు అరవింద్ పుల్ల పెట్టకుండా ఉండి ఉంటే మిర్చి సినిమా అల్లు అర్జున్ ఖాతాలోనే పడి ఉండేది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news