MoviesSSMB29 సినిమా టైటిల్ లీక్ అయిపోయిందోచ్.. పేరుతోనే హిట్ కొట్టావ్ పో...

SSMB29 సినిమా టైటిల్ లీక్ అయిపోయిందోచ్.. పేరుతోనే హిట్ కొట్టావ్ పో రా రాజమౌళి..!

ప్రజెంట్ ఇండస్ట్రీలో ఉండే సినీ లవర్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్న సినిమా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించబోయే మూవీ . ఈ సినిమా కోసం సినీ స్టార్ సెలబ్రెటీస్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటనే రాలేదు. కానీ బ్యాగ్రౌండ్ లో మాత్రం అన్ని పనులు చకచకా పూర్తయిపోతున్నాయి. ఇండోనేషియా కి సంబంధించిన హాట్ బ్యూటీ ని ఈ సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది.

అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాలో అభిమానులు రచ్చ రంబోలా చేస్తున్నారు . ఈ సినిమాని పూర్తి డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి అన్న విషయం ఇప్పటికే వైరల్ అయింది . లొకేషన్స్ హంటింగ్, స్టోరీ డిస్కషన్స్ , కాస్టింగ్ విషయాలపై డిస్కషన్స్ మొదలు పెట్టాడు రాజమౌళి . ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడట . ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇది ఒక జంగిల్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతుందట . అయితే ఈ సినిమా కోసం రాజమౌళి ఇప్పటికే రెండు టైటిల్స్ అనుకున్నాడట. ఒకటి మహారాజా రెండోది చక్రవర్తి . ఈ రెండు టైటిల్స్ లో ఒకటి ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు . అయితే చాలామంది ప్రిన్స్ మహేష్ బాబుకి చక్రవర్తి అనే టైటిల్ బాగా సూట్ అవుతుంది అని రాజమౌళి డైరెక్షన్ ప్రకారం చక్రవర్తి అనే టైటిల్ పెడితే సినిమాకి మరింత హైపోచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే టైటిల్ వైరల్ గా మారింది . చూదాం మరి రాజమౌళి ఏ టైటిల్ ని చూసి చేసుకుంటాడో..? మహారాజా నా..? చక్రవర్తి నా..? తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news