Moviesపద్మ భూషణ్ లు..పద్మ విభూషణ్ లు ఊరికే వచ్చేయవ్ బ్రో.. సోషల్...

పద్మ భూషణ్ లు..పద్మ విభూషణ్ లు ఊరికే వచ్చేయవ్ బ్రో.. సోషల్ మీడియాని మడతపెట్టేస్తున్న చిరంజీవి (వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా సరే .. మెగాస్టార్ చిరంజీవి అన్న పేరు వినపడగానే వచ్చే అరుపులు , కేకలు ఓ రేంజ్ లో ఉంటాయి . యంగ్ హీరో లుంగీ కట్టి.. నోట్లో బీడీ పెట్టి స్టెప్స్ వేయడం చాలా కామన్ . కానీ 68 ఏళ్లు వచ్చాక కూడా అదే ఎనర్జీని మైంటైన్ చేస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ.. ఫాన్స్ ని అదే విధంగా కంటిన్యూ చేస్తూ థియేటర్స్లలో.. ఆయన బొమ్మ పడగానే విజిల్స్ వేయించుకుంటున్నాడు అంటే దాని వెనక మెగాస్టార్ చిరంజీవి పడిన కష్టం ఎంతో ఉంది .

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అందరికీ ఇన్స్పిరేషన్ . ఈ విషయం అందరికీ తెలిసిందే . ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర కు ఫిక్స్ అయ్యాడు చిరంజీవి . యూవీ మూవీ క్రియేషన్స్ నిర్మాణంలో డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. బియాండ్ యూనివర్సిటీ అన్న కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట.

ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ అభిమానులను ఈ సినిమాపై ఫ్యూచర్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకునేలా చేసేసింది . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి కష్టపడుతున్న తీరు మెగా అభిమానులకి షాకింగ్ గా ఉంది. 68 ఏళ్ల వయసులోనూ జిమ్ లో యంగ్ హీరోలా కష్టపడుతున్నాడు. తాజాగా మెగాస్టార్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు .

ఈ వీడియోలో చిరంజీవి జిమ్ బాగా కష్టపడి చేస్తున్నారు . రకరకాల వ్యాయామాలతో తన బాడీని మళ్లీ ఫిట్గా మార్చుకునేందుకు ట్రై చేస్తున్నారు . సినిమా కోసం చిరంజీవి ఏమైనా చేస్తాడు.. ఎంత దూరమైనా వెళ్తాడు అన్నదానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు మెగా అభిమానులు. అంతేకాదు రాత్రికి రాత్రి ఊరికే మెగాస్టార్లు అయిపోరు ..పద్మభూషణ్ లు,, పద్మ విభూషణులు వచ్చేయవు.. అంటూ ఎవరైతే చిరంజీవిని ట్రోల్ చేశారు వాళ్లకి ఘాటుగా ఇచ్చుపడేస్తున్నారు మెగా అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news