Moviesట్రెండ్ సెట్టర్ అంటే మన తెలుగు హీరోనే.. ఫస్ట్ టైం అక్కడ...

ట్రెండ్ సెట్టర్ అంటే మన తెలుగు హీరోనే.. ఫస్ట్ టైం అక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్న మహేష్ బాబు..!

పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తాను అని.. ఆ డైలాగ్ అప్పట్లో ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.. వైరల్ అయింది అనేది అందరికీ తెలిసిందే . ఇప్పటికి పలు విషయాలలో మనం ఆ డైలాగ్ ను వాడుతూనే ఉంటాం . రీసెంట్గా అదే డైలాగ్ను మహేష్ బాబు బాగా అప్లికేబుల్ చేసుకున్నాడు. నేను అందరిలా ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను అంటూ గుంటూరు కారం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎవ్వరూ ఊహించని విధంగా కనీ విని ఎరుగని రేంజ్ లో చేయబోతున్నాడట .

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా గుంటూరు కారం . జనవరి 13వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు గుంటూరు కారం. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు అప్డేట్స్ అభిమానులను కొంచెం ఆకట్టుకొని కొంచెం నిరాశపరిచిన త్వరలో జరగబోయే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం గుంటూరు కారం పై పూర్తిగా హైప్స్ పెంచబోతుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడ గుంటూరు అభిమానుల మధ్య చేయాలి అని మొదటి నుంచి డిసైడ్ అయ్యారు చిత్ర బృందం. ఎందుకంటే ఈ చిత్రానికి గుంటూరు కారం అనే టైటిల్ పెట్టడం ఆ ప్రాంతంలో ఈవెంట్ నిర్వహిస్తే చాలా బాగుంటుంది అని వార్తలు వినిపించడమే .. కానీ గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. జనవరి 6న ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందట. హైలెట్ ఏంటంటే.. అదే రోజు ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నారట.

అంతేకాదు ఇప్పటివరకు ఎవరు ఊహించని విధంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తో మహేష్ బాబు సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నారట . కాలిఫోర్నియా సినీ లాంచ్ ప్రీమియం సెవెన్ సినిమాలో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో లైవ్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు పైగా ఇదే మొదటిసారి. దీంతో మహేష్ బాబు ట్రెండ్ సెట్ చేశాడు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news