Movies‘దేవర’ షార్ట్ గ్లింప్స్ లో ఇది గమనించారా.. సముద్రంలో రక్త...

‘దేవర’ షార్ట్ గ్లింప్స్ లో ఇది గమనించారా.. సముద్రంలో రక్త కెరటాలు.. క్రేజీ హింట్ ఇచ్చిన కొరటాల..!!

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న సినిమా “దేవర”. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం . ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కూడా ఇదే. ఈ క్రమంలోనే సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు .

మరీ ముఖ్యంగా దేవర పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది . అదేవిధంగా మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న దేవర గ్లింప్స్ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే కొరటాల శివ ఈ సినిమా పై ఇంకా హైప్స్ పెంచేస్తూ షార్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు . జనవరి 8న ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డేట్ చెప్పారు కానీ కరెక్ట్ టైం చెప్పలేదు .

ఈ క్రమంలోనే టైం కూడా అనౌన్స్ చేస్తూ షార్ట్ గ్లింప్స్ రిలీక్ చేశారు . ఆ గ్లింప్స్ లో ఎన్టీఆర్ తన ఆయుధాన్ని పట్టుకొని సముద్రంలో రక్తాన్ని కడుగుతూ కనిపించారు . ఆ రక్తం తో మొత్తం కెరటాలు అంతా ఎర్రగా కనిపిస్తాయి . ఇది చూసిన ఆడియన్స్ కి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అంతేకాదు జనవరి 8న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ చేసే గ్లింప్స్ కచ్చితంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది అంటున్నారు జనాలు ,

అంతేకాదు రిలీజ్ అయిన షార్ట్ ఫిలిమ్స్ ఆధారంగా కచ్చితంగా ఎన్టీఆర్ పట్టుకున్న ఆయుధం ఈ సినిమాకి మెయిన్ కీలకంగా మారబోతుంది అని ..ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి పోస్టర్ లోనూ కొరటాల దానిని హైలెట్ చేస్తూ చూపించారు అని ..గతంలో సింహాద్రి సినిమాలో రాజమౌళి ఎలా ఓ ఆయుధాన్ని కీలకంగా మార్చారో.. ఇప్పుడు కొరటాల శివ ఈ సినిమాకి ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఆయుధాన్ని కీలకంగా మారుస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news