Moviesఇండస్ట్రీలోకి హీరోయిన్ గా మరో తెలుగు అమ్మాయి.. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటే...

ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా మరో తెలుగు అమ్మాయి.. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటే దిమ్మ తిరిగిపోద్ది..అంత తోపు..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నారు . కానీ వాళ్ళల్లో తెలుగు హీరోయిన్స్ మాత్రం చాలా చాలా తక్కువ నే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలుగు హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి రావడానికి బాగా ట్రై చేస్తున్నారు . రీసెంట్గా బేబీ సినిమాతో యూట్యూబ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరో అమ్మాయి తెలుగు తెరపై తన లక్ ని పరీక్షించుకోబోతుంది .

ఆమె మరెవరో కాదు శివాని . అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా పేరుతో మన ముందుకు రాబోతుంది. నిజానికి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఆదరణ చాలా తక్కువగా దక్కుతుంది. అది అందరికీ తెలిసిందే . అందుకే చాలామంది తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ క్రేజ్.. పాపులారిటీ సంపాదించుకొని.. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు అందుకుంటూ ఉంటారు.

కానీ శివాని మాత్రం డైరెక్ట్ గా తెలుగులోనే తన లక్ ని పరీక్షించుకోబోతుంది. పలు వెబ్ సిరీస్లో యూట్యూబ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న శివాని.. సెకండ్ లీడ్ కోసం ఈ సినిమా ఆడిషన్ కు వెళ్తే డైరెక్టర్ ఏకంగా హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . ఈ విషయాన్ని చెప్పి అమ్మడు చాలా ఆశ్చర్యకరంగా ఫీల్ అయింది . హైదరాబాద్ కి చెందిన శివాని పలు యూట్యూబ్ వీడియోలు ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాతో కచ్చితంగా తనకి మంచి గుర్తింపు దక్కుతుంది అని ధీమా వ్యక్తం చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news