Movies"సిగ్గులేకుండా నేను అలా చేయను".. రష్మిక కు దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిన...

“సిగ్గులేకుండా నేను అలా చేయను”.. రష్మిక కు దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిన తాప్సి..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ ఎలా ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తున్నారో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే చాలా బోల్డ్ గా పచ్చిగా మాట్లాడేస్తున్నారు . రీసెంట్గా హీరోయిన్ తాప్సి చేసిన కామెంట్స్ బాలీవుడ్ నే కాదు టాలీవుడ్ మీడియాని కూడా షేక్ చేసి పడేస్తున్నాయి . తాప్సి ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .

ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ బాలీవుడ్ -కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్ . లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. రీసెంట్గా నటించిన డంకీ సినిమా కూడా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. రీసెంట్గా తాప్సి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..యానిమల్ సినిమాపై బోల్డ్ గా స్పందించింది . “యానిమల్ సినిమాలో నటించడం తప్పు అని నేను అనడం లేదు .. సినిమా నటులకు ఒక పవర్ ఉంటుంది.. అదే సమయంలో బాధ్యత కూడా ఉంటుంది . ఆ బాధ్యతను అన్నివేళలా మనం గౌరవించుకోవాలి “.

“మనం ప్రజాస్వామిక దేశంలో పుట్టాము ..నచ్చింది చేసే స్వేచ్ఛ హక్కు రెండూ మనకు ఉన్నాయి ..నేనైతే యానిమల్ మూవీ లో అస్సలు నటించను” అంటూ తెగేసి చెప్పేసింది . దీంతో తాప్సి పరోక్షంగా రష్మిక మందన్నాను టార్గెట్ చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి బోల్డ్ అండ్ వైలెంట్ మూవీలో రష్మిక నటించడం పట్ల రష్మిక ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు. చాలామంది యానిమల్ సినిమాపై ఫైర్ అయ్యారు . ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోయిన్ తాప్సి కూడా అదేవిధంగా పరోక్షకంగా రష్మికపై ఫైర్ అవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూద్దాం దీనిపై రష్మిక మందన్నా ఏవిధంగా కౌంటర్ ఇస్తుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news