Moviesదారుణంగా పడిపోయిన గుంటూరు కారం సెకండ్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు...

దారుణంగా పడిపోయిన గుంటూరు కారం సెకండ్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు బొక్క అంటే..?

గుంటూరు కారం .. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు నటించిన మూవీ . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ దక్కించుకుంది . అయితే మొదటి బొమ్మ పడగానే సినిమాపై నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది.

సినిమాలో పెద్ద కంటెంట్ లేదని.. త్రివిక్రమ్ అదే ఇల్లు అదే ఫ్యామిలీ సెంటిమెంట్ ను పండించాడు అని..శ్రీలీల డాన్స్ ఒకటి హైలెట్ అని.. మహేష్ బాబు నాటీ డైలాగ్స్ బాగున్నాయి అని కామెంట్స్ చేశారు. మొదటిరోజు ఓ రేంజ్ లో కుమ్మిపడేసిన గుంటూరు కారం రెండవ రోజు కలెక్షన్స్ దారుణాతి దారుణంగా పడిపోయాయి. మహేష్ కెరియర్ లోనే చెత్త రికార్డు క్రియేట్ చేసే విధంగా..

సెకండ్ డే కేవలం 9 అంటే 9 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది . దీంతో గుంటూరు కారం సినిమా డిజాస్టర్ కా బాప్ రేంజ్ లో కామెంట్స్ దక్కించుకుంటుంది. అంతేకాదు గుంటూరు కారం సినిమా మహేష్ కి పరమ చెత్త రికార్డును క్రియేట్ చేసి పెట్టింది. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. మొత్తానికి మహేశ్ కి భారీ బొక్క పడింది అనమాట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news