Moviesరేణుదేశాయ్ - స‌మంత జీవితాల్లో సేమ్ టు సేమ్ జ‌రిగింది ఇదే...!

రేణుదేశాయ్ – స‌మంత జీవితాల్లో సేమ్ టు సేమ్ జ‌రిగింది ఇదే…!

ప్రేమలు, పెళ్లిళ్లు అనేవి ఈ త‌రంలో చాలా కామ‌న్ అయిపోయాయి. ఇప్పుడు ఎవ‌రు ఎప్పుడు ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డుతున్నారో ? ఎప్పుడు విడిపోతున్నారో కూడా అర్థం కావ‌డం లేదు. కామ‌న్ మ్యాన్ ప్రేమ‌, విడాకుల సంగ‌తి ఎలా ఉన్నా.. సెల‌బ్రిటీల ప్రేమ‌లు, పెళ్లిళ్లు అంటేనే అంద‌రికి బాగా ఇండ్ర‌స్ట్‌. సెల‌బ్రిటీలు చాలా త్వ‌ర‌గా ప్రేమ‌లో ప‌డుతున్నారు.. అంతే త్వ‌ర‌గా పెళ్లి చేసుకుని.. విడాకులు తీసుకోవ‌డ‌మో లేదా బ్రేక‌ప్ చెప్పేసుకోవ‌డ‌మో చేస్తున్నారు.

ఇదిలా ఉంటే త‌మ అభిమాన హీరోల‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన కొంద‌రు స్టార్ హీరోయిన్లు.. ఆ హీరోల అభిమానుల చేతుల్లో దారుణ అవ‌మానాలు, ట్రోలింగ్‌కు గుర‌వుతున్నారు. టాలీవుడ్‌లో ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్లుగా ఉన్న రేణుదేశాయ్‌, స‌మంత ఇద్ద‌రూ కూడా త‌మ‌తో క‌లిసి న‌టించిన హీరోల‌నే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత కొంత‌కాలం కాపురం చేశాక విడాకులు తీసుకున్నారు.

రేణుదేశాయ్ త‌న‌తో బ‌ద్రి, జానీ సినిమాల్లో కలిసి న‌టించిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నే ప్రేమ వివాహం చేసుకుంది. ప‌దేళ్లు కాపురం చేసి ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌న్నాక మ‌న‌స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో విడాకులు తీసుకున్నారు. అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత ఇద్ద‌రు క‌లిసి నాలుగు సినిమాలు చేశారు. వీరు తొలిసినిమా టైం నుంచే ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు కూడా క‌లిసి కాపురం చేయ‌కుండానే విడిపోయారు.

వీరిద్ద‌రు త‌మ అభిమాన హీరోల‌ను పెళ్లి చేసుకున్న‌ప్పుడు ఆ హీరోల ఫ్యాన్స్ ఈ హీరోయిన్ల‌ను నెత్తిన పెట్టేసుకున్నారు. ఎప్పుడు అయితే వారికి విడాకులు ఇచ్చారో అప్ప‌టి నుంచి వీరిని ఆ హీరోల అభిమానులు టార్గెట్ చేయ‌డం మొద‌లైంది. రేణును ప‌వ‌న్ అభిమానులు ఎప్ప‌టిక‌ప్పుడు గుచ్చుతూ, నెగ‌టివ్ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇటు స‌మంత‌ను కూడా నాగ‌చైత‌న్య‌తో పాటు అక్కినేని అభిమానులు ఎలా టార్గెట్ చేస్తున్నారో చూస్తూనే ఉంటున్నాం.

ఏదేమైనా స్టార్ హీరోల‌ను ప్రేమించి ఎంతో సంబ‌రంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ ఇద్ద‌రు హీరోయిన్లు ఎప్ప‌ట‌కీ ట్రోలింగ్‌కు గుర‌వుతూ దారుణంగా అవ‌మానాలు భ‌రిస్తోన్న మాటవాస్త‌వం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news