Moviesప్ర‌భాస్ - విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ల్టీస్టార‌ర్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...!

ప్ర‌భాస్ – విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ల్టీస్టార‌ర్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే…!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ సినిమానా ? ఇది నిజంగానేనా ? అని డౌట్ ప‌డొద్దు.. 100 % స‌త్యం. అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ సినీ జ‌ర్నీ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన వైజ‌యంతీ సంస్థ‌తో విజ‌య్ అనుబంధం అలా పెన‌వేసుకుపోయింది. ఆ త‌ర్వాత అదే బ్యాన‌ర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన మ‌హాన‌టి సినిమాలోనూ స‌మంత‌కు జోడీగా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించి.. ఆ సినిమా విజ‌యంలో భాగ‌మ‌య్యాడు. అయితే ఇప్పుడు అదే సంస్థ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా హాలీవుడ్ రేంజ్‌లో నిర్మిస్తోన్న ప్ర‌భాస్ క‌ల్కి సినిమాలో కూడా ఓ కీల‌క పాత్ర‌లో విజ‌య్ క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.

గ‌త కొద్ది రోజులుగా ఈ ప్ర‌చారం గ‌ట్టిగా న‌డుస్తోంది. అయితే ఆ పాత్ర గెస్ట్ రోలా ? లేక క‌థ‌లో విజ‌య్ పాత్ర‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందా ? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే క‌ల్కి సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్, దుల్క‌ర్ స‌ల్మాన్ లాంటి ఉద్దండులు ఉన్నారు. మ‌రి ఇప్పుడు విజ‌య్ కూడా ఈ ప్రాజెక్టులోకి యాడ్ అయితే క‌ల్కి సినిమా మ‌రింత ఆక‌ర్ష‌ణ వ‌చ్చిన‌ట్టే.

ఇక క‌ల్కి సినిమాకు ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, మ‌హాన‌టి సినిమాల డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news