Moviesఓరి దేవుడోయ్.. "గుంటూరు కారం" ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్...

ఓరి దేవుడోయ్.. “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ఎగొట్టింది అందుకేనా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత విషయాలను కూడా తవ్వి లోడి ట్రోల్ చేయడం అలవాటుగా మారిపోయింది . ట్రోలర్స్ మీమర్స్ కు ఇదే పనిగా మార్చుకున్నారు . రీసెంట్ గా సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమాకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది . అయితే ఈ సినిమాలో శ్రీ లీల – మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది అంటూ కొందరు అంటుంటే.. అట్టర్ ఫ్లాప్ అయింది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కలెక్షన్స్ ఏమో 164 కోట్లు వచ్చినట్లు మూవీ టీం ప్రకటిస్తుంది . సినిమాకి అంత సీన్ లేదు అంటూ యాంటీ మహేష్ బాబు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ మధ్య పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎందుకు రాలేదు అన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది .

నిజానికి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని చీఫ్ గెస్ట్ గా అనుకున్నారట మేకర్స్ . అయితే ఆయనకు సమయం లేక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . కానీ అదంతా అబద్ధమని .. పవన్ కళ్యాణ్ కావాలనే ఈ సినిమాకు రాలేదు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . పవన్ కళ్యాణ్ గుంటూరు కారం సినిమాకు కాంపిటీషన్ ఇచ్చిన హనుమాన్ సినిమాకు సపోర్ట్ చేశారట. ఆ కారణంగానే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయారట . ఈ విషయం బయటకు చెప్పుకోలేక గుంటూరు కారం టీం ఆయన పొలిటికల్ పనుల్లో బిజీగా ఉన్నాడు అని ఆ కారణంగానే రాలేకపోయాడు అని ప్రచారం చేసిందట. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news