Moviesబిగ్ షాకింగ్: ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్...

బిగ్ షాకింగ్: ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు ఊహించని కోలుకోలేని షాక్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి హీరో ప్రెసెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ గ్లోబల్ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా దేవర కావడం గమనార్హం. ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కూడా దేవర కావడం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం .

ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది . మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా పోస్ట్ పోన్న్ అయినట్లు తెలుస్తుంది .కొత్త డేట్ ని ప్రకటించకపోయినప్పటికీ ఆగస్టులో కానీ అక్టోబర్ లో కానీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ . అయితే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయాలి. దీనికి సంబంధించిన లుక్ కూడా రిలీజ్ అయిపోయింది .

అయితే సలార్ 2 సినిమాను త్వరగా సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . రీసెంట్గా ప్రశాంత్ నీల్ ని ఎన్టీఆర్ కలిశారు . అంతేకాదు ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారట . సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారట . దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా తెరకెక్కే దానికి ప్లాన్ చేస్తున్నారట . ఈలోపు ఎన్టీఆర్ వార్ 2, దేవర 2 సినిమాలను కంప్లీట్ చేసుకునే విధంగా ఆలోచిస్తున్నారట . దీంతో ఎన్టీఆర్ అభిమానులకి ఇది బ్యాడ్ న్యూస్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news