MoviesNBK 109: బాబి - బాల‌య్య సినిమాలో ఈ హైలెట్స్ చూశారా...!

NBK 109: బాబి – బాల‌య్య సినిమాలో ఈ హైలెట్స్ చూశారా…!

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. ఇది బాల‌య్య కెరీర్‌లో 109వ సినిమా. అఖండ‌, వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి సినిమాల‌తో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన బాల‌య్య ఇప్పుడు బాబితో సినిమా చేస్తుండ‌డంతో టాలీవుడ్‌లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి వ‌స్తోన్న ప్ర‌తి అప్‌డేట్ ఆస‌క్తిగా ఉంటోంది.

సినిమాలో సెకండాఫ్‌లో వ‌చ్చే ప్లాస్ బ్యాక్‌పై ఓ క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ ప్లాష్ బ్యాక్‌లో బాల‌య్య 60 ఏళ్ల ఓల్డ్ గెట‌ప్‌లో క‌నిపిస్తాడ‌ట‌. అలాగే బాల‌య్య ర‌ఫ్ అండ్ ర‌గ్గుడ్ లుక్‌లో క‌నిపిస్తాడ‌ట‌. ఈ ప్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చే సీన్లు భారీ యాక్ష‌న్‌తో న‌డుస్తాయ‌ట‌. ఈ ప్లాష్‌బ్యాక్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హైలెట్ ఉంటుంద‌ట‌. ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ రోల్ ఉంద‌ని.. ఈ పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్‌ద‌త్ కూడా న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే సంజ‌య్‌ద‌త్‌ను తీసుకున్నార‌ని టాక్ ? ఈ సినిమా బాల‌య్య టైపు ఫ‌క్తు యాక్ష‌న్ డ్రామా కాద‌ని.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌తో సాగే ఎమెష‌న‌ల్ డ్రామా అని సినిమా టీం చెపుతోంది. అలాగే సినిమాలో పొలిటిక‌ల్ నేప‌థ్యం కూడా ఉంటుంద‌ట‌. ఇక బాల‌య్య‌కు ఎప్పుడూ క‌లిసొచ్చేలాగానే ఈ సినిమాలోనూ డ్యూయ‌ల్ రోల్లో క‌నిపించ‌నున్నాడు.

సితార ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news