Moviesఇండస్ట్రీలో అంతమంది మెగా హీరోలు ఉంటే.. మన మెగాస్టార్ చిరంజీవికి ఏ...

ఇండస్ట్రీలో అంతమంది మెగా హీరోలు ఉంటే.. మన మెగాస్టార్ చిరంజీవికి ఏ హీరో అంటే ఇష్టమో తెలుసా..?

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు. ఆ హీరోలలో సగానికి పైగా మెగా హీరోలే . మెగా ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు ఎంతోమంది.. అందరూ సక్సెస్ అయ్యారు అని చెప్పలేం కానీ వచ్చిన వాళ్ళు మాత్రం మెగా హీరోలుగా పాపులారిటీ దక్కించుకున్నారు . అయితే మెగా ఇంటి నుంచి అంతమంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ఫేవరెట్ హీరో మాత్రం వేరే హీరో ఉన్నారు.

అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు మెగాస్టార్ చిరంజీవి . ఆయన జెన్యూన్ పర్సన్ ..ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు.. అవతల వ్యక్తిని హర్ట్ చేయడు.. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తాడు . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి..” తనకి ఇండస్ట్రీలో ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా చాలా ఇష్టమని .. అలాగే ప్రభాస్ లుక్స్ అండ్ డైలాగ్ డెలివరీ బాగుంటుంది అని.. చాలా సైలెంట్ గా కనిపిస్తూనే కిల్లర్ పర్ఫామెన్స్ ఇవ్వడంలో ప్రభాస్ నెంబర్ వన్ అని” చెప్పుకు వచ్చాడు .

అదే కామెంట్ లు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. చిరంజీవి చెప్పింది నిజమని ప్రభాస్ మల్టీ టాలెంటెడ్ అని ..సైలెంట్ గానే పర్ఫామెన్స్ తో 100 మార్కులు వేయించుకోగలిగే సత్తా ఉన్న నటుడు అని.. పొగిడేస్తున్నారు . రీసెంట్గా ఆయన నటించిన సలార్ సినిమా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోసేసిందో మనం చూసాం. త్వరలోనే కల్కి సినిమాతో మన ముందు రాబోతున్నాడు ప్రభాస్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news