Newsరష్మిక కంటే ముందే విజయ్ దేవరకొండ ఆ హీరోయిన్ ని ఇష్టపడ్డాడా..?...

రష్మిక కంటే ముందే విజయ్ దేవరకొండ ఆ హీరోయిన్ ని ఇష్టపడ్డాడా..? ప్రాణంగా ప్రేమించి ఎందుకు వదిలేశాడు అంటే..?

ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు తెగ ట్రెండింగ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన వార్తలు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంటుంది . కాగ ఇండస్ట్రీలో టాప్ పోస్ట్ హీరోగా రాజ్యమేలేస్తున్న విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని వార్తలు ఈమధ్య కాలంలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం.

విజయ్ దేవరకొండ హీరోగా పలు సినిమాలో నటించినప్పటికీ ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం “పెళ్లిచూపులు”. ఈ సినిమాలో చాలా డీసెంట్ లుక్స్ లో ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ దేవరకొండ తో ఈ సినిమాలో రీతు వర్మ రొమాన్స్ చేసింది . చాలా హెల్దీ వేలో వీళ్ళ మధ్య కెమిస్ట్రీ పండింది . ఈ సినిమా టైంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగింది అంటూ వార్తలు వినిపించాయి .అంతే కాదు ప్రమోషన్స్ కోసం వీళ్ళు చేసిన పబ్లిసిటీ స్టంత్స్ కూడా వాళ్ళమధ్య ఏదో ఉంది అని చెప్పడానికి కారణమయ్యాయి .

అయితే విజయ్ దేవరకొండ – రీతు వర్మ ని లవ్ చేసిన విషయం వాస్తవమే కాని రీతు వర్మ మాత్రం విజయ్ దేవరకొండ పై అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోలేదని.. ఎందుకంటే ఆల్రెడీ అమ్మడుకి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని .. అతగాడినే పెళ్లి చేసుకుంటుంది అని అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే పెళ్లిచూపులు హిట్ తర్వాత రీతు వర్మ హిట్ కొట్టిందే లేదు. పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు క్రేజ్ రాలేదు . దీంతో అమ్మడి బాయ్ ఫ్రెండ్ అయితే ఆమెను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్లిపోయాడట . దీంతో ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news