Newsల‌వ్‌లో ప‌డి ఎంగేజ్మెంట్ అయ్యాక బ్రేక‌ప్ చెప్పుకున్న సినీ సెల‌బ్రిటీలు వీళ్లే...!

ల‌వ్‌లో ప‌డి ఎంగేజ్మెంట్ అయ్యాక బ్రేక‌ప్ చెప్పుకున్న సినీ సెల‌బ్రిటీలు వీళ్లే…!

ప్రస్తుతం ప్రేమ వివాహాలు.. కులాంతర వివాహాలు జరగటం చాలా కామన్ అయిపోయింది. ఎంతోమంది పెళ్ళికి ముందు ప్రేమించుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితంలో ముందుకు వెళుతున్నారు. కొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకున్నాక కూడా పెళ్లికి ముందే తమ ప్రేమలకు బ్రేకప్ చెప్పుకుంటున్నారు. చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా ప్రేమించుకుని ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ చెప్పుకున్నారు. అలాంటి సినీ సెలబ్రిటీలు ఎవరో చూద్దాం.

అఖిల్ – శ్రేయ భూపాల్ :
అక్కినేని నాగార్జున వారసుడుగా అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చారు. అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రేయ భూపాల్ ప్రేమలో పడ్డాడు. ఆమె అపోలో ప్రతాపరెడ్డి మనవరాలు. ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత శ్రియ భూపాల్ తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. అఖిల్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు.

ర‌క్షిత్ శెట్టి – ర‌ష్మిక మంద‌న్న :

కన్నడ సినీ నటులు రక్షిత్ శెట్టి, రష్మిక ఇద్దరు కూడా కిరాక్ పార్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. ఆ సినిమా షూటింగ్ టైంలో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి రష్మికకు వరుసగా అవకాశాలు రావడంతో ఆమె తన ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకుని కెరీర్ పరంగా సినిమాలలో బిజీగా ఉన్నారు.

ఉద‌య్ కిర‌ణ్ – సుస్మిత :


టాలీవుడ్‌లో రెండు దశాబ్దాల క్రిందట ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా కొనసాగుతున్న టైంలో మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కుమార్తె సుస్మితను ఉదయ్ కిరణ్ ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఎంతో ఘనంగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఏమైందో తెలియదు కానీ వీరిద్దరికీ బ్రేకప్ జరగడంతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని సుష్మిత చెన్నైకు చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కూడా విషిత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్నారు. 2014లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే.

త్రిష్ – వ‌రుణ్ :

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న త్రిష చెన్నైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాల‌ని వ‌రుణ్ ముందుగానే కండిషన్లు పెట్టడంతో అది నచ్చక త్రిష బ్రేకప్ చెప్పుకుని తిరిగి సినిమాల్లో కంటిన్యూ అవుతూ ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news