Moviesపుష్ప VS సలార్: ప్రభాస్‌కి ఉన్నంత సీన్.. బన్నీకి లేదా... మళ్లీ...

పుష్ప VS సలార్: ప్రభాస్‌కి ఉన్నంత సీన్.. బన్నీకి లేదా… మళ్లీ మొదలైన లొల్లి..!

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ నేషనల్ స్టార్ హీరోలు అయిపోతున్నారు. ఈ లిస్టులో ముందుగా బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ఆ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు కనీవినీ ఎరుగని రేంజ్ లో వసూళ్లు కొల్లగొట్టాయి. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసుకుని తీస్తున్నారు. ఈ క్రమంలోనే రాధేశ్యామ్‌ బాలీవుడ్ మార్కెట్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్ట లేకపోయినా.. సాహో, ఆదిపురుష్ సినిమాలకు నార్త్‌లో కూడా మంచి వసూళ్లు వచ్చాయి.

ఇక ఈరోజు రిలీజ్ అయిన సలార్.. సౌత్ కంటే నార్త్‌లో మిడ్ నైట్ షోల నుంచే విధ్వంసం ఆడేస్తోంది. ఆ తర్వాత పుష్ప సినిమాతో బన్నీ కూడా నార్త్ మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్గా అడుగు పెట్టాడు. నార్త్‌లో ప్రమోషన్లు లేకుండా పుష్ప రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఇప్పుడు వీరిద్దరు కూడా పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్.. ఓజి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్ మీద అంతగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు లేడు.

రాజమౌళి సినిమాతో.. మహేష్ కూడా పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ప్రభాస్, బన్నీ అభిమానుల మధ్య ఎవరు ? పాన్ ఇండియా హీరో అన్నదానిపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇద్దరు హీరోల అభిమానులు కొట్టేసుకుంటున్నారు. వాస్తవంగా చూస్తే పుష్ప సినిమాకు టాలీవుడ్ లో భారీ ఎత్తున ప్రమోషన్లు చేశారు. నార్త్ లో ముందు ప్రమోషన్లు చేయకపోయినా.. సినిమా అక్కడ మెల్లగా పికప్ అయ్యాక భారీ ఎత్తున ప్రమోషన్లు చేశారు. అదే సలార్‌ సినిమాకు కనీసం ఒక్క చిన్న ఈవెంట్ కూడా ఎక్కడ చేయలేదు? రాజమౌళితో ఇంటర్వ్యూ మినహాయిస్తే దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు.

పైగా బన్నీకి కేవలం పుష్ప సినిమాతోనే నార్త్‌లో మార్కెట్ వచ్చింది. అదే ప్రభాస్‌కు బాహుబలి 1, 2 సినిమాలతో పాటు సాహో సినిమా డిజాస్టర్ అయినా.. కూడా బాలీవుడ్‌లో రూ.150 కు పైగా కోట్లు కొల్లగొట్టింది. ఆదిపురుష్‌ సినిమా కూడా బాలీవుడ్‌లో రూ.150 కోట్లు రాబట్టింది. ఇక ఇప్పుడు సలార్ నార్త్ ఇండియాలో చాలా సింపుల్ గా రూ.500 కోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ మార్కెట్ ను బన్నీ ఎప్పటికీ అందుకోలేడు అంటూ ప్రభాస్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే బన్నీ అభిమానులు కూడా పుష్ప 2 సినిమాతో తమ హీరో సత్తా చాటుతాడని కౌంటర్లు ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news