Moviesముదురు ఆంటీతో మ‌హేష్ రొమాన్స్‌... కెరీర్‌లోనే ఇంత చెత్త సినిమా చేసుండ‌డు..!

ముదురు ఆంటీతో మ‌హేష్ రొమాన్స్‌… కెరీర్‌లోనే ఇంత చెత్త సినిమా చేసుండ‌డు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి దిగుతోంది. మహేష్ తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. అయితే కెరీర్ ప్రారంభంలో మహేష్ వయసులో తనకంటే పెద్ద హీరోయిన్లతోను నటించారు. తొలి సినిమా రాజకుమారుడు హీరోయిన్ ప్రీతిజింతా.. మహేష్ బాబు కంటే పెద్ద.

రెండో సినిమా యువరాజులో నటించిన సాక్షి శివానంద్, సిమ్రాన్, మూడో సినిమాలో నటించిన మహేష్ బాబు జీవిత భాగస్వామి నమ్రత కూడా వయసులో మహేష్ కంటే పెద్దవారు. మహేష్ తనకంటే వయసులో పెద్ద హీరోయిన్లతో చేసిన ప్రేక్షకుల నుంచి పెద్దగా కంప్లైంట్లు లేవు. అయితే యువరాజు సినిమాలో నటించిన సిమ్రాన్, సాక్షి శివానంద్ ఇద్దరూ కూడా మహేష్ పక్కన ముదురు ఆంటీలలా కనిపించారు.

అస్సలు ఈ ఇద్దరినీ మహేష్ పక్కన జోడిగా చూడలేకపోయాం అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. లేత పిల్లాడు మహేష్ పక్కన.. ముదురు ఆంటీలు హీరోయిన్లా ? అంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. పైగా ఈ సినిమాలో మహేష్ ఒక బిడ్డకు తండ్రిగా నటించడం కూడా ప్రేక్షకులు అస్సలు ఊహించుకోలేకపోయారు. అందుకే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకోలేదు.

హీరోయిన్లు కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ అన్న‌ చర్చ అప్పట్లో నడిచింది. మిక్స్‌డ్‌ టాక్ వచ్చిన కూడా యువరాజు సినిమా ఆ రోజుల్లో మహేష్ బాబు క్రేజ్ తో 17 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. యువరాజు తర్వాత వంశీ సినిమా నిరాశపరిచిన మురారి సినిమా మహేష్ కు మంచి హిట్ సినిమాగా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news