Newsక‌ళ్యాణ్‌రామ్ ' డెవిల్ ' రిలీజ్ డేట్‌... కెరీర్‌లో అతి పెద్ద...

క‌ళ్యాణ్‌రామ్ ‘ డెవిల్ ‘ రిలీజ్ డేట్‌… కెరీర్‌లో అతి పెద్ద రిస్క్‌….!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసారా సినిమాతో తన కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ కొట్టారు. బింబిసారా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే 50 కోట్ల సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ యేడాది స్టార్టింగ్‌లో అమిగోస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ నిరాశ పరిచినా తాజాగా డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కళ్యాణ్ రామ్ – మాళవిక నాయర్ – ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్ పోస్టర్లు, రెండు పాటలు, ఫస్ట్ లుక్ టీజర్ అన్ని ఆకట్టుకునే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు పెంచేశాయి. అయితే రకరకాల కారణాలవల్ల ఈ సినిమా కొన్నాళ్లుగా వాయిదాలు ప‌డుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు.

డెవిల్ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న అంచనాలతో నిర్మాతలు ఉన్నారు. అయితే ప్రభాస్ నటిస్తున్న డైనోసార్ సినిమా ధియేటర్లలోకి వచ్చిన వారం రోజుల తర్వాత డెవిల్ రిలీజ్ అవుతుండడంతో కళ్యాణ్ రామ్ రిస్క్ చేస్తున్నాడా అన్న సందేహం కూడా కలుగుతుంది. మరి కళ్యాణ్ రామ్ స‌లార్‌ను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర ఎలా సత్తా చాటుతాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news