News"హాయ్ నాన్న" రేటింగ్స్ బాగా వచ్చినా.. కలెక్షన్స్ దొబ్బేయడానికి కారాణం ఇదే..తప్పు...

“హాయ్ నాన్న” రేటింగ్స్ బాగా వచ్చినా.. కలెక్షన్స్ దొబ్బేయడానికి కారాణం ఇదే..తప్పు చేశావ్ డైరెక్టర్..!!

నాచురల్ స్టార్ నాని హీరోగా తాజాగా నటించిన సినిమా “హాయ్ నాన్న”. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా డిసెంబర్ 7న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . సినిమాలో పెద్దగా చెప్పుకోతగ్గ నెగిటివ్ కంటెంట్ ఏదీ లేకపోయినప్పటికీ.. పాజిటివ్ కంటెంట్ కూడా లేదు అంటున్నారు జనాలు . అంతేకాదు ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తప్పిస్తే సినిమాలో అసలు మెయిన్ పాయింట్ లేదు అని …

నాని సినిమా అంటే కాస్తో కూస్తో కామెడీ టైమింగ్ ఎక్స్పెక్ట్ చేస్తామని .. అది కూడా లేకుండా డైరెక్టర్ సినిమాను తెరకెక్కించి తప్పు చేశాడు అని జనాలు అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకి చాలామంది 2.25, 2. 75, 3.00 రేటింగ్స్ ఇచ్చారు . అయితే కలెక్షన్స్ చూస్తే మాత్రం గుండె తరుక్కుపోయే రేంజ్ లో ఉన్నాయి. కేవలం 6.10 కోట్లు మొదటి రోజు కలెక్ట్ చేసి పరమ చెత్త కలెక్షన్ సాధించింది హాయ్ నాన్న .

ఈ సినిమా కలెక్షన్స్ తక్కువగా రాబట్టడానికి కారణం ఇదే అని నాని ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాలో నాని ను వేరే లెవెల్ లో చూస్తామని ఎక్స్పెక్ట్ చేశారు .. కానీ ని కామెడీ టైమింగ్ లేకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూడడానికి ఇష్టపడడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news