News' గుంటూరు కారం ' మీనాక్షి చౌద‌రికి ఇంత అన్యాయం...

‘ గుంటూరు కారం ‘ మీనాక్షి చౌద‌రికి ఇంత అన్యాయం చేశారా…!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న సినిమా గుంటూరు కారం. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన అత‌డు, ఖ‌లేజా సినిమాలు రెండు క‌మ‌ర్షియ‌ల్‌గా కంటే మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ ఇద్ద‌రికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు 13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ వీరి కాంబినేష‌న్ రిపీట్ అవుతుండ‌డంతో స‌హ‌జంగానే అంచ‌నాలు ఆకాశంలో ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో ముందుగా పూజాహెగ్డే, శ్రీలీల‌ను హీరోయిన్లుగా తీసుకున్నారు. కొన్ని కార‌ణాల‌తో పూజా త‌ప్పుకోవ‌డంతో ఆమె ప్లేస్‌లో మీనాక్షి చౌద‌రిని హీరోయిన్‌గా తీసుకున్నారు. శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్లు కావడంతో సినిమాకు కావాల్సినంత గ్లామ‌ర్ వ‌చ్చేసింది. అయితే ఈ సినిమా సాంగ్స్ విష‌యంలో ఇప్పుడో షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ముందు నుంచి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ ఉంటారా ? ఉండ‌రా అన్న స‌స్పెన్స్ న‌డిచింది. ఇక సినిమాలో మొత్తం 5 పాట‌లే ఉంటాయంటున్నారు. అత‌డు, ఖ‌లేజా రెండు సినిమాల్లో పాట‌లు సూప‌ర్ హిట్‌. ఇప్పుడు గుంటూరు కారం పాట‌ల విష‌యంలోనూ భారీ అంచ‌నాలే ఉంటాయి. ఇప్ప‌ట‌కీ ఒక్క పాటే బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌.

మిగిలిన పాట‌ల్లో ఒక్క‌టి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుంద‌ని.. ఒక‌టి మాంటేజ్ సాంగ్ అని.. ఇందులో ఫ్యామిలీని మొత్తం చూపిస్తారంటున్నారు. అంటే ఇక రెండు పాట‌లే ఉన్నాయి. ఒక‌టి హీరోయిన్ మీనాక్షి హీరో వెంట‌ప‌డుతూ పాడే సాంగ్ అట‌. అంటే ఇక ఒక పాటే ఉంది. అంటే ఆ ఒక్క సాంగ్ డ్యూయెట్ అనుకుంటే అది శ్రీలీల – మ‌హేష్ మీద ఉంటుంద‌ట‌. అంటే మీనాక్షి చౌద‌రితో డ్యూయెట్ ఉండే ఛాన్సులు లేవు. ఆమెకు మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ ఇద్ద‌రూ అన్యాయం చేసిన‌ట్టే అనుకోవాలి. ఇది నిజంగా మ‌హేష్ అభిమానుల‌కే కాదు.. ఇటు త్రివిక్ర‌మ్‌.. టోట‌ల్ టాలీవుడ్ అభిమానుల‌కు నిరాశ అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news