Newsయంగ్ బ్యూటీ శ్రీలీలకు బిగ్ షాక్.. పాపం ఎలా తట్టుకుంటుందో ఏమో..?

యంగ్ బ్యూటీ శ్రీలీలకు బిగ్ షాక్.. పాపం ఎలా తట్టుకుంటుందో ఏమో..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న శ్రీలీలకు పెద్ద టఫ్ సిచువేషన్ ఎదురయిందా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు. నిన్న మొన్నటి వరకు ఓ పక్క సినిమాలు మరోపక్క చదువును సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్న శ్రీ లీలకు ఇప్పుడు పెద్ద సవాల్ ఎదురైంది. శ్రీలీలకు లైవ్ సెషన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి .

అయితే ఇది ఎప్పటిలా రాత్రి చదివేసి ఉదయం పరీక్ష రాస్తే సరిపోదు . కచ్చితంగా శ్రీ లీల కాలేజ్ కి అటెండ్ అవ్వాలి . ఒకటి రెండు రోజులు కాదు దాదాపు నెల రోజులపాటు అమ్మడు ఈ పరీక్షలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది . అయితే శ్రీలీలకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదట . ముందు వెనక ఆలోచించకుండా అన్ని సినిమాలకు కమిట్ అయితే ఇలానే ఉంటుంది అంటూ జనాలు కౌంటర్స్ వేస్తున్నారు .

మరికొందరు శ్రీలీల పొజిషన్ ని అర్థం చేసుకొని బాధ పడిపోతున్నారు . నిజానికి ఈ పరీక్షలు రెండు నెలలు తరువాత జరగాల్సింది.. కానీ కొన్ని కారణాల చేత త్వరగా ఈ పరీక్షలు పెడుతున్నారట. షూటింగ్స్ బంద్ చేసుకుని ఆమె పరిక్షలు రాయడం తప్పిస్తే తప్ప దీనికి పరిష్కారం కనిపించడం లేదు. చూద్దాం మరి ఈ ముద్దుగుమ్మ ఎలా ఈ టాప్ సిచువేషన్ నుంచి బయటపడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news