Newsడెవిల్ సినిమా కొసం క‌ళ్యాణ్‌రామ్ ఎన్ని డ్రెస్సులు వాడాడో తెలుసా... అన్ని...

డెవిల్ సినిమా కొసం క‌ళ్యాణ్‌రామ్ ఎన్ని డ్రెస్సులు వాడాడో తెలుసా… అన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టారా..!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసార సినిమాతో తన కెరీర్‌లోనే సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలి రూ.50 కోట్ల సినిమాగా బింబిసార రికార్డుల్లోకి ఎక్కింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో అమీగోస్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ నిరాశపరిచాడు. ఈ సినిమాలో కళ్యాణ్ మూడు వైవిధ్యమైన పాత్రలలో నటించినా.. సినిమా కథలో దమ్ము లేక ప్రేక్షకులను మెప్పించలేదు.

ఈ యేడాదికి ముగింపు పలుకుతూ కళ్యాణ్ రామ్ ఈనెల 29న డెవిల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. నామ అభిషేక్ నిర్మాతగా, దర్శకుడుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు, టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ప్రచార చిత్రాలు, టీజర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ జోడీగా సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. డెవిల్ సినిమా బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కుతోంది.

కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించాడు. దీంతో కళ్యాణ్ రామ్ లుక్.. ఆహార్యం చాలా స్పెషల్ గా ఉండాలి. అదే టైంలో భారతీయత ఉట్టిపడేలా ఉండాలి. అందుకోసం కాస్ట్యూమ్స్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదట. భారీగా ఖర్చు పెట్టారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ఏకంగా 90 కాస్ట్యూమ్స్ వాడారు. వీటికోసం ఇటలీ నుంచి ప్రత్యేకంగా మొహైర్ ఊల్ దిగుమతి చేసుకున్నారు.

సినిమాలో కళ్యాణ్ రామ్ ప్రతి సీన్లను బ్లేజర్ తో కనిపిస్తాడు. 25 స్పెషల్ వెస్ట్ కోట్స్ వాడారు. అలాగే కళ్యాణ్ రామ్ స్పెషల్ గడియారం కూడా వాడతాడు. దీనికోసం ఢిల్లీలో పురాతన వాచీలు సేకరించే వ్యక్తి నుంచి తీసుకున్నారు. ఈ సినిమాలో కేవలం కళ్యాణ్ రామ్ కాస్ట్యూమ్స్ ఖర్చు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల రేంజ్‌లో అయినట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news