Moviesయానిమల్ సినిమా ఎఫెక్ట్ : ఆ క్రేజీ ట్యాగ్ ను కోల్పోయిన...

యానిమల్ సినిమా ఎఫెక్ట్ : ఆ క్రేజీ ట్యాగ్ ను కోల్పోయిన రష్మిక మందన్నా..పాపం ఎలా తట్టుకుంటుందో ఏమో..?

పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు భారీ ఆశలు అంచనాలు పెట్టుకొని నటించిన యానిమల్ సినిమా రష్మిక మందన్నాకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ సినిమా చూసి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెను పోగడటం లేదు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో టూ బోల్డ్ గా నటించి ఉన్న పరువు తీసేసుకుంది అంటూ బూతులు తిడుతున్నారు .కోస్టార్స్ కూడా ఆమె నటన పై స్పందించకుండా కేవలం రన్బీర్ కపూర్ యాక్టింగ్ పై మాత్రమే స్పందిస్తూ ఉండడం ఇందుకు నిదర్శనం .

అయితే రీసెంట్గా అరుదైన గుర్తింపును పోగొట్టుకునింది రష్మిక . రష్మిక అనగానే ముందుగా నేషనల్ క్రష్ అనే ట్యాగ్ కనిపిస్తుంది. అయితే యానిమల్ సినిమాలో నటించిన తర్వాత ఆమెకు ఆ ట్యాగ్ పోయినట్లు జనాలు చెప్తున్నారు. న్యూ నేషనల్ క్రష్ గా తృప్తి దిమ్రి ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆమె మరెవరో కాదు ఈ సినిమాలో రన్బీర్ కపూర్ తో న్యూడ్ గా నటించి అభిమానులను మెస్ మరైజ్ చేసిన అందాల బాలీవుడ్ ముద్దుగుమ్మ .

ఈ సినిమాలో రష్మిక మందన్నా నటించిన తీరుకు జనాలు బూతులు తిడుతుంటే ..న్యూడ్ క్యారెక్టర్ నటించినా సరే ఆమెను మాత్రం ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అందుకు కారణం తెరపై ఆమె కనిపించిన క్షణాలు తక్కువే అయినా ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం కుర్రాళ్ళ గుండెల్లో గుచ్చుకునేలా చేసాయి. చాలామంది రష్మికకు ఆ ట్యాగ్ తీసేసి న్యూ నేషనల్ క్రష్ గా తృప్తి పేరుని ప్రమోట్ చేస్తున్నారు. దీంతో రష్మిక పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news