Moviesపోలీస్ ఆఫిసర్ ని పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. ఏం...

పోలీస్ ఆఫిసర్ ని పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. ఏం లక్కి ఛాన్స్ కొట్టేసింది రా బాబోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకుని త్వరగా లైఫ్ లో సెటిలైపోతున్నారు కొందరు హీరో హీరోయిన్స్ . మరీ ముఖ్యంగా చిన్న ఏజ్ లోనే కొంతమంది పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా దిల్ రాజు వారసుడు ఆశిష్ నిశ్చితార్థం చేసుకొని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే . ఇప్పుడు తాజాగా అదే లిస్టులోకి వచ్చేసింది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చిత్రా శుక్ల .

2014లో “చల్ భాగ్” అనే హిందీ మూవీతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ 2016లో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ” మా అబ్బాయి” అనే మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో “రంగులరాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి “..తదితర చిత్రాల్లో నటించింది. కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆమెకు గుర్తింపు తీసుకురాలేకపోయింది .

కాగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోయినా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ వైభవ్ ఉపాధ్యాయ అనే వ్యక్తితో క్లోజ్ గా రొమాంటిక్ గా దిగిన ఫొటోస్ వైరల్ అయ్యాయి. అప్పుడే వీళ్లు ప్రేమలో ఉన్నారన్న రూమర్స్ వచ్చాయి . వాటిని నిజం చేస్తూ అమ్మడు డిసెంబర్ 8న పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది . ప్రస్తుతం మెహందీ హెల్దీ సెలబ్రేషన్స్ లో బిజీ బిజీగా ఉంది చిత్ర శుక్ల. ఆమె తన కాబోయే భర్త వైభవ్ తో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి . కాగా మధ్యప్రదేశ్లో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు వైభవ్ ఉపాధ్యాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news