Moviesఅల్లు అర్జున్ మాల్ లో జబర్ధస్త్ వర్ష కి ఘోర అవమానం.....

అల్లు అర్జున్ మాల్ లో జబర్ధస్త్ వర్ష కి ఘోర అవమానం.. వీడియో వైరల్..!!

వర్ష .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . బుల్లితెరపై తనకంటూ క్రేజ్ ని పాపులారిటీని దక్కించుకుంది. మరీ ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో కొన్ని స్కిట్స్ చేసి తన పేరుని బాగా పాపులారిటీ దక్కించుకునేలా చేసుకుంది . కాగా పలు షోస్ తో ఈవెంట్స్ తో బిజీబిజీగా ఉన్న వర్ష ఏడుస్తూ ఓ వీడియోని షేర్ చేసింది. దీంతో అభిమానులు ఫుల్ డీలా పడిపోయారు.

ఏమైంది వర్షా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు అభిమానులు. ఆ వీడియోలో వర్ష మాట్లాడిన మాటలు ఆధారంగా ..”ఆమె రీసెంట్ గా అల్లు అర్జున్ థియేటర్ ఏ ఏ ఏ మాల్ కి సినిమా చూడడానికి వెళ్ళింది . కారును పార్కింగ్ కి ఇచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేసి మళ్లీ బయటకు రావడానికి బయటకు వచ్చి కార్ పార్కింగ్నుండి తీసుకోవడానికి వెయిట్ చేసింది”.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తి వచ్చి ఆమెతో దుర్భాషలాడారు . నోటికి చెప్పలేని విధంగా ఉండే మాటలతో ఆమెను హర్ట్ చేశారు .. ఇబ్బందికర సిచువేషన్ ని క్రియేట్ చేశారు. అసలు తప్పు లేకుండానే ఆమె వద్దకు వచ్చి అలా మాట్లాడడం న్యాయం కాదు అంటూ ఆమె వీడియోలో చెప్పుకు వచ్చింది . అంతేకాదు ఒక ఆడపిల్ల పై అదీ తన కుటుంబం ముందు ఇలా అరిస్తే ఎలా ఉంటుంది ..?? కొంచమైన సెన్స్ లేదా త్వరలోనే అతగాడి ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తాను ..దయచేసి ఎవరూ అమ్మాయిలపై ఇలా అరవద్దండి అంటూ రిక్వెస్ట్ చేసింది. ప్రజెంట్ వర్ష వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news