Newsఅప్పటి హీరోయిన్ ఆమనిని టూ పీస్ వేయాలి.. ప్రైవేటుగా గ‌డ‌పాల‌ని కండీష‌న్...

అప్పటి హీరోయిన్ ఆమనిని టూ పీస్ వేయాలి.. ప్రైవేటుగా గ‌డ‌పాల‌ని కండీష‌న్ పెట్టిందెవ‌రు…?

సీనియర్ నటి ఆమనై గుర్తుంది కదా, ఇప్పుడు కూడా మంచి క్యారెక్టర్ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తన వారసత్వం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమని మేన కోడలు హీరోయిన్‌గా సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, తాజాగా త్రిష వివాదం రోజు రోజుకి మరింత రాజుకుంటోంది. దాంతో తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వారు రియాక్ట్ అవకపోయినా టాలీవుడ్ లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి, నితిన్ లాంటి వాళ్ళు ఘాటుగానే స్పందిస్తున్నారు.

రోజా కూడా త్రిషకి మద్ధతు తెలిపింది. సీనియర్ నటుడు మన్సూర్ అలీ త్రిష రేప్ సీన్ గురించి చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దాంతో కొందరు సినీ తారలు గతంలో వారికి జరిగిన కాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పుతున్నారు. ఈ క్రమంలోనే ఆమని కూడా తమిళ ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.

అప్పట్లో కొందరు తను నల్లగా ఉంటుందని వంక చెప్పి అవకాశాల కోసం వాళ్ళకి కావాల్సింది అడిగారట. మరికొందరు టూపీస్ ధరించాలని..ఆడిషన్ లో అలా టూపీస్ తో కనిపించమనీ ఇబ్బంది పెట్టారట. అలాంటి అవకాశాలు వదులుకున్నట్టుగా ఆమని చెప్పుకొచ్చింది. అంతేకాదు, పెళ్ళి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆమని మళ్ళీ నటించాలనుకున్నప్పుడు కొందరు పొట్టపై స్టెచ్ మార్క్స్ ఉన్నాయా చూపించండీ అని అడిగారట.

తమతో ప్రైవేట్ గా గడపమనీ అడిగిన దర్శకనిర్మాతలు, మేనేజర్స్ ఉన్నారని ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది తప్పకుండా ఉందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది ఆమని. అయితే, ఇంత తెలిసి నీ మేనకోడలని ఇండస్ట్రీకి ఎందుకు తీసుకొచ్చారని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే ఆమని, శుభలగ్న, శుభసంకల్పం, ఘరానా బుల్లోడు బ్లాక్ బస్టర్స్ లో నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news