Newsవ‌ర్క‌వుట్ల‌తో దుమ్ము రేపుతోన్న ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా.. టాలీవుడ్‌లో పెద్ద...

వ‌ర్క‌వుట్ల‌తో దుమ్ము రేపుతోన్న ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా.. టాలీవుడ్‌లో పెద్ద కాంట్ర‌వ‌ర్సీ క్వీన్‌..!

సీనియర్ నటి మాళవిక గుర్తుందా 1990 – 2000 జనరేషన్ ఈ భామను అంత ఈజీగా మర్చిపోలేరు. తెలుగులో శ్రీకాంత్ – వడ్డే నవీన్ కాంబినేషన్లో వచ్చి సూపర్ హిట్ అయిన చాలా బాగుంది సినిమాలో వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత చంద్రముఖి, ఆంజనేయులు వంటి సినిమాలలో మెరిసింది. ఉషాకిరణ్ మూవీస్ నిర్మాణంలో శ్రీకాంత్ హీరోగా, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన దీవించండి సినిమాలోను నటించింది. అటు జేడీ చక్రవర్తికి జోడిగా నవ్వుతూ బతకాలిరా సినిమాలోనూ నటించిన ఈ బ్యూటి తమిళంలో చిత్తరం.. పేసుదడి సినిమాలో స్పెషల్ సాంగ్లో మాళ‌విక వేసిన డ్యాన్స్ చాలా పాపులర్ అయింది.

మాళవిక మలయాళీ అమ్మాయి. 1999లో అజిత్ కు జంటగా ఉన్ని తేడా సినిమాతో హీరోయిన్గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత ఈమెకు వరుసగా చాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మాళవిక హీరోయిన్గా నటించి బాగా పాపులర్ అయింది. తెలుగు కంటే తమిళంలోని ఆమెకు ఎక్కువ ఛాన్సులు వచ్చాయి. ఐదేళ్లపాటు హీరోయిన్గా కొనసాగిన తర్వాత ఆమెకు అనుకున్న అవకాశాలు రాలేదు.

అందుకు ప్రధాన కారణం ఆమె కాంట్ర‌వ‌ర్సీ అన్న ముద్ర పడిపోయింది. హీరోయిన్ ఛాన్సులు రాక మాళవిక చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకుంది. 2007లో సుమేష్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయింది. అయితే ఇనేళ్ళ‌ తర్వాత 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ యాక్టివ్గా ఉంటుంది. ఈ క్రమంలోనే మళ్లీ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. సుమారు 14 ఏళ్ల తర్వాత ఆమె రీఎంట్రికి రెడీ అయింది. ఇందులో భాగంగా తమిళంలో ఓ ప్రోగ్రామ్ చేస్తోంది.

త్వరలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో రీయంట్రీ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. తెలుగులో రాజేంద్రప్రసాద్ కి జోడిగా ఒక సినిమాలో నటించిన ఆమె రాజేంద్రప్రసాద్ తనను లైంగీకంగా ఇబ్బంది పెట్టాడు అంటూ అప్పట్లో పెద్ద రచ్చే చేసింది. ఈ విషయం టాలీవుడ్ లో పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. ఆ తర్వాత ఛాన్సులు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు. అలా ఆమె తెలుగులో ఫేడవుట్‌ అయ్యింది. ఇక ఆమె వ‌ర్క‌వుట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుంటాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news