Newsసన్నీ లియోన్‌తో సందీప్ రెడ్డి వంగా సినిమా...!

సన్నీ లియోన్‌తో సందీప్ రెడ్డి వంగా సినిమా…!

టాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా రాంగోపాల్ వర్మ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డీ వంగాకే వచ్చింది. ఈ కల్ట్ కాన్సెప్ట్ ని ఢీల్ చేసిన విధానం ఇండస్ట్రీ వర్గాల వారినే షేక్ చేసింది. పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కాంగ్రెస్ లీడర్ వీ హనుమంత రావు చేసిన కామెంట్స్ ని దాదాపు అందరూ తప్పు పట్టారు. సినిమా రిలీజయ్యాక కూడా పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

విజయ్ దేవరకొండ క్యారెక్టర్..హీరోయిన్ తో అతగాడు చేసిన రొమాన్స్ గురించి చాలా మాట్లాడుకున్నారు. ఇటీవల కాలంలో అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్నంతగా ఇంటిమేట్ సీన్స్ ఇంకో సినిమాలో లేవనే చెప్పాలి. భాష మారినా హిందీలో ఆయన రీమేక్ చేసిన కబీర్ సింగ్ కూడా అంతే. షాహిద్ కపూర్, కియారా అద్వానీలు బాగా హైలెట్ అయ్యారు.

అర్జున్ రెడ్డి సినిమా అంత పేరు తెచ్చినా తెలుగులో చాలా కాలానికి ప్రభాస్ సినిమా కమిటయ్యాడు తప్ప ఇంకో హీరో ఎవరూ ముందుకు రాలేదు. బాలీవుడ్ లో ఇప్పుడు యానిమల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ వైరల్ అయ్యాయి.

యానిమల్ టీజర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా బెడ్రూం సీన్స్, ముద్దులు లేకుండా సినిమా చేయలేడా ..ఇలాంటి సీన్స్ వల్ల ఎవరికి ఉపయోగం..అసలే సమాజంలో యువతీ యువకులు పెడదారి పడుతుంటే సందీప్ లాంటి దర్శకులు వచ్చి ఇంకా చెడగొట్టే విధంగా సినిమాలు తీయడం అస్సలు బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు.

సందీప్ స‌న్నీలియోన్‌ను పెట్టి ఇలాంటి సినిమాలు చేసుకోవ‌డం మంచిద‌ని కొంద‌రు స‌ల‌హాలు ఇస్తున్నారు. అయితే, ఇది క్రియేటివ్ ఫీల్డ్..ఎవరిని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే ఒక స్టైల్ ఉండాలి. సందీప్ ఈ స్టైల్లో సినిమా తీసి మెప్పిస్తున్నాడని ఆయన అభిమానులు మాట్లాడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news