Newsమనీషా కోయిరాలాను కమల్ హాసన్ ఆ ప‌నికి బలవంతం చేశాడా...?

మనీషా కోయిరాలాను కమల్ హాసన్ ఆ ప‌నికి బలవంతం చేశాడా…?

కమల్ హాసన్ అంటే ముద్దుల విషయంలో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హస్మీ కంటే టాప్ అని అందరూ చెప్పుకుంటారు. హిందీలో ఇమ్రాన్ హష్మీ సినిమాలు చూసే మన సౌత్ లో కూడా హీరోలు హీరోయిన్స్ ముద్దు పెట్టుకోవాలని ఆరాటం మొదలైందని కొందరు మాట్లాడుకున్నారు. వాళ్ళందరికీ అంతకముందు కమల్ హాసన్ సినిమాలు అంతగా చూసే ఛాన్స్ రాలేదేమో అనుకోవాలి.

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు కూడా హీరోయిన్ ని పెదవి ముద్దు పెట్టుకోవాలని కోరిక కలగడానికి, దర్శకరచయితలు అందుకు తగ్గట్టుగా సీన్స్ రాయడానికి ఇన్స్పిరేషన్ ఇమ్రాన్ సినిమాలు కాదు. కాకపోతే అదొక కమర్షియల్ ఫార్ములాగా వర్కౌట్ అయింది గనక తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో ఇలాంటి సీన్స్ ఎక్కువయ్యాయి. సీనియర్ హీరోలు కూడా హీరోయిన్స్ కి ముద్దు పెట్టాలని కాస్త ఉబలాట పడ్డారు.

దీనికోసం దర్శకులు కొన్నిసార్లు హీరోయిన్స్ ని ఒప్పించడానికి బాగానే ప్రయత్నించారు. సీన్ చెప్పినప్పుడే ఈ సీన్ లో కిస్ ఉంటుందని అది ఎలా ఉంటుందో ఎంత సేపు ఉంటుందో చెప్పి కాస్త నసికినా ఫైనల్ గా ఒప్పిస్తున్నారు. కానీ, కమల్ హాసన్ మాత్రం తన సినిమాలలో ముద్దు సీన్స్ గురించి నేరుగా ఆయనే హీరోయిన్స్ తో మాట్లాడి ఒప్పిస్తారట.

కమల్ హాసన్ సినిమా ఏది తీసుకున్నా అందులో హీరోయిన్ తో ముద్దు సీన్ ఉంటుంది. అలా భారతీయుడు సినిమాలో కూడా మనీషా కోయిరాలతో ఓ సాంగ్ లో ముద్దు పెట్టుకునే షాట్ ఉంటుంది. దర్శకుడు శంకర్ ఈ విషయంలో మనీషాకి చెప్పడానికి సందేహించారట. దాంతో కమల్ హాసన్ లీడ్ తీసుకొని మనీషాతో కాసేపు మాట్లాడి టెలిఫోన్ ధ్వనిలా అనే సాంగ్స్ లో ముద్దు పెట్టాడు. కమల్ కి హీరోయిన్ ని ముద్దు పెట్టుకోవడం అంత సరదా మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news