Newsఅప్పుడు సమంతతో ముద్దులు.. ఇప్పుడు మృణాల్‌తో పండగలు.. విజయ్ దేవరకొండ మహా...

అప్పుడు సమంతతో ముద్దులు.. ఇప్పుడు మృణాల్‌తో పండగలు.. విజయ్ దేవరకొండ మహా చిలిపి..!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా సమంత నటించింది. డిజాస్టర్ సినిమాలో నటించిన విజయ్‌కు ఖుషి సినిమా హిట్ అవ్వటం ఎక్కడా లేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ కలిసి జంటగా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాకు సర్కారు వారి పాట దర్శకుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విజయ – పరుశురాం కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అయింది.

దీంతో ఫ్యామిలీ స్టార్ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ దిల్ రాజు నిర్మాణ సార‌ధ్యం వహిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌ సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసింది. అందులోని డైలాగ్ ట్విట్టర్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది.

తాజాగా విజయ్ దేవరకొండ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆ ఫోటోలో విజయ్.. మృణాల్‌తో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటూ కనిపించాడు. అయితే ఇది ఫ్యామిలీ స్టార్ సినిమాలో స్టిల్ అని అంటున్నారు. ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఖుషి సినిమాలో సమంతను త‌న ఒడిలో కూర్చోపెట్టుకుని ముద్దులు కురిపిస్తూ ఘాటుగా రొమాన్స్ చేయ‌డం అదిరిపోయింది.

ఇప్పుడు మృణాల్‌ ఠాకూర్‌ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెను వాటేసుకుని దీపావళి సెలబ్రేషన్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటో మామూలుగా వైరల్ కావడం లేదు. దీంతో నెటిజెన్లు అప్పుడు సమంతతో ముద్దులు.. ఇప్పుడు మృణాల్‌తో దీపావళి సెలబ్రేషన్స్. నువ్వు మహా చిలిపి వాడివి అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ తండ్రి, భర్తగా ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news