Newsపవన్ పక్కన ఆ హీరోయిన్ ఉండాల్సిందే..సురేఖ అంత పట్టు పట్టడానికి కారణం...

పవన్ పక్కన ఆ హీరోయిన్ ఉండాల్సిందే..సురేఖ అంత పట్టు పట్టడానికి కారణం ఇదే..!

మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ హీరోగా మారాడు. సుప్రియ కూడా ఇదే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమా ఆశించిన సక్సెస్ సాధించలేదు. కానీ, పవన్ కళ్యాణ్ హీరో మెటీరియల్ అని మాత్రం ఇండస్ట్రీ ఒప్పుకుంది. దాంతో వరుసగా సినిమాలకి సైన్ చేశాడు పవన్ కళ్యాణ్.

మూడవ సినిమా తొలిప్రేమ తో తిరుగు లేని స్టార్ డం ని సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే, ఈ మధ్యలో వచ్చిన సినిమా గోకులంలో సీత. తమిళంలో సూపర్ హిట్ సాధించిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. ఒరిజినల్ కథ అగస్త్యన్ అందించగా, పోసాని కృష్ణమురళి డైలాగ్స్ అందించారు.

ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మొదటి సక్సెస్ ని అందుకున్నారు. అయితే, గోకులంలో సీత సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించాల్సిన హీరోయిన్ ముందు రాశి కాదట. అప్పుడు ఫాంలో ఉన్న హీరోయిన్ ని అనుకున్నారట. కొందరు కొత్త అమ్మాయిలని చూశారట. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ చూస్తున్నారని తెలియగానే చిరు భార్య సురేఖ రాశి పేరు చెప్పిందట. మొదటి సినిమాలో సురేఖ రాశి పేరు చెప్పిందట. కానీ ఎందుకో కుదరలేదు.

తమిళంలో ఒరిజినల్ కథ తెలుసు కాబట్టి టైటిల్ కూడా గోకులంలో సీత పెట్టారు కాబట్టి కళ్యాణ్ బాబు పక్కన రాశి అయితేనే బావుంటుందని పట్టుపట్టి చిరంజీవితో రాశి ఫిక్స్ అయ్యేలా చేసిందట. అంత పట్టు సురేఖ గనక పట్టకపోతే పవన్ కళ్యాణ్ సరసన రాశి కనిపించేది కాదు. ఒదిన వల్లే మరిది అయిన పవన్ కళ్యాణ్ హీరో కూడా అయ్యాడని చెప్పుకుంటుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news